చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం సిబ్బందికి కరోనా
ABN, First Publish Date - 2022-01-13T02:36:00+05:30
నగరంలోని చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం

హైదరాబాద్: నగరంలోని చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఐదు మంది అర్చకులకు, ఆలయ ఈవో, స్వీపర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆలయంలో మొత్తం ఏడు మంది అర్చకులు, నలుగురు వంటవారు ఉన్నారు. అయితే బుధవారం సాయంత్రం నాలుగు గంటల వరకు కొవిడ్ కారణంగా భక్తులకు దర్శనాలు రద్దు అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత దర్శనాలు కల్పించేందుకు ఆలయ కమిటీ దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తుండటంతో భక్తులు అయోమయానికి గురవుతున్నారు. అయితే చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు ఎలాంటి అనుమతి లేదని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Updated Date - 2022-01-13T02:36:00+05:30 IST