Munugode By Election: ఢిల్లీ బ్రోకర్లను మన ఎమ్మెల్యేలు చెప్పుతో కొట్టి పంపారు: కేసీఆర్
ABN, First Publish Date - 2022-10-30T16:37:37+05:30
‘‘ఢిల్లీ బ్రోకర్ల (Delhi Brokers)ను మన ఎమ్మెల్యేలు చెప్పుతో కొట్టి పంపారు. ఢిల్లీ బ్రోకర్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొనాలని చూశారు. మేము అంగట్లో పశువులము కాదు’’ అని సీఎం కేసీఆర్ (CM KCR) అన్నారు.
నల్లగొండ: ‘‘ఢిల్లీ బ్రోకర్ల (Delhi Brokers)ను మన ఎమ్మెల్యేలు చెప్పుతో కొట్టి పంపారు. ఢిల్లీ బ్రోకర్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొనాలని చూశారు. మేము అంగట్లో పశువులము కాదు’’ అని సీఎం కేసీఆర్ (CM KCR) అన్నారు. చండూరులో బహిరంగ సభ కేసీఆర్ మాట్లాడుతూ వందల కోట్ల డబ్బుతో ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనుగోలు చేసి.. ప్రభుత్వాలను కూల్చాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. ప్రధాని మోదీకి ఇంకా ఏం కావాలి.. మోదీ రెండుసార్లు ప్రధానిగా చేసి కూడా.. ఇలాంటి అరాచకాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? అని కేసీఆర్ ప్రశ్నించారు. అవసరం లేకుండా మునుగోడు ఉపఎన్నిక (Munugode By Election) వచ్చిందని విమర్శించారు. మునుగోడు ప్రజలు ఫలితాలను ఎప్పుడో తేల్చేశారని స్పష్టం చేశారు. ప్రజలు ఆలోచించుకుని ఓట్లు వేయాలని, ఒళ్లు మర్చిపోయి ఓటేస్తే ఇల్లు కాలిపోతుందని ఆయన హెచ్చరించారు. దోపిడీదారులు మాయమాటలు చెబుతూనే ఉంటారని, కరిసే పామును మెడలో వేసుకుంటామా? అని కేసీఆర్ ప్రశ్నించారు.
‘‘చేనేతలకు ఏ ప్రధాని చేయని దుర్మార్గం ప్రధాని మోదీ చేశారు. చేనేతలపై కేంద్రం 5శాతం జీఎస్టీ విధించింది. బీజేపీకి ఎందుకు ఓటేయాలని చేనేతలు ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే.. బీజేపీకి చేనేతల నుంచి ఒక్క ఓటు కూడా పోవద్దు. చేతిలో ఉన్న ఆయుధాన్ని ప్రజలు కాపాడుకోవాలి. కార్పొరేట్ల జేబులు నింపడానికే బీజేపీ పనిచేస్తోంది. విద్యుత్ సంస్కరణ ముసుగులో మీటర్లు పెడతారట. ఇళ్లల్లో మీటర్లు కూడా రూ.30వేలు పెట్టి మార్చుకోవాలట. ప్రలోభాలకు ఆశపడితే గోసపడేది మనమే’’ అని కేసీఆర్ హెచ్చరించారు.
Updated Date - 2022-10-30T18:14:43+05:30 IST