ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగుభూమికి పట్టా ఇవ్వడం లేదని దళిత రైతు ఆత్మహత్యాయత్నం

ABN, First Publish Date - 2022-09-15T09:30:29+05:30

తనకు ప్రభుత్వం కేటాయించిన భూమికి పట్టాదారు పాస్‌ పుస్తకం ఇవ్వడం లేదని ఓ దళిత రైతు బుధవారం ఆత్మహత్యాయత్నం చేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోనరావుపేట, సెప్టెంబరు 14: తనకు ప్రభుత్వం కేటాయించిన భూమికి పట్టాదారు పాస్‌ పుస్తకం ఇవ్వడం లేదని ఓ దళిత రైతు బుధవారం ఆత్మహత్యాయత్నం చేశాడు. బాధిత రైతు రాములు తెలిపి న వివరాల ప్రకారం.. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేటలో గత ప్రభు త్వం 24 గుంటల భూమి పట్టా ఇచ్చింది. అప్పటి నుంచి ఆ భూమిని సాగు చేసుకుంటున్నప్పటికీ పట్టాదారు పాస్‌బుక్‌ మాత్రం రాలేదు. దీంతో పది నెలల క్రితం ధరణిలో దరఖాస్తు చేసుకున్నాడు. పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరిగి, తహసీల్దార్‌కు రూ 20 వేలు లంచం కూడా ఇచ్చాడు. లంచం తీసుకొని కూడా తహసీల్దార్‌ పాసుబుక్‌ ఇవ్వటం లేదని ఆగస్టులో ఆర్డీవోకు ఫిర్యాదు చేశాడు. దీంతో పొలం వద్దకు వచ్చి సర్వే చేస్తానని తహసీల్దార్‌ చెప్పటంతో రోజంతా పొలం వద్ద వేచి ఉన్నాడు. అయినా అధికారులు రాకపోవటంతో విసిగిపో యి పురుగుల మందు తాగినట్లు తెలిపాడు. రాములును కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ విషయమై తహసీల్దార్‌ నరేందర్‌ను వివరణ కోరగా రాములు తనను ఎప్పుడూ కలవలేదని తెలిపారు. అది శిఖం భూమి అని తేలటంతో పాస్‌బుక్‌ ఇవ్వలేదని, తనకు లంచం ఇచ్చానని చెప్పటం అవాస్తవమని పేర్కొన్నారు.

Updated Date - 2022-09-15T09:30:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising