Chikoti Praveen case: మంత్రి తలసాని సోదరులను ప్రశ్నిస్తున్న ఈడీ
ABN, First Publish Date - 2022-11-16T16:45:14+05:30
క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ కుమార్ (Chekoti Praveen Kumar)ను విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్: క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ కుమార్ (Chekoti Praveen Kumar)ను విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. చీకోటితో ఉన్న సంబంధాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ (Thalasani Srinivas) సోదరులైన మహేష్, ధర్మేందర్ ఈడీ ప్రశ్నిస్తోంది. మనీలాండరింగ్, కెసీనో కేసులో ఈడీ విచారణ చేస్తోంది. గతంలో ప్రవీణ‌్‌తో కలిసి విదేశాలకు మహేష్, ధర్మేందర్ వెళ్లినట్లు చెబుతున్నారు. తలసాని శ్రీనివాస్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు చీకోటి ప్రవీణ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారనే విషయాన్ని ఈడీ ఇదివరకే గుర్తించింది. మరోవైపు రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలతో చీకోటి ప్రవీణ్ వాట్సాప్ (Whatsapp)లో చాటింగ్ చేసినట్టు గుర్తించారు. ఈ చాట్ ఆధారంగా సదరు రాజకీయ నాయకులతో ప్రవీణ్‌కు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ప్రవీణ్ ఇచ్చిన సమాధానాల ఆధారంగా, అవసరమైతే ఆ ప్రజాప్రతినిధులను ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
చీకోటి దావత్ అంటే..
‘కాయ్ రాజ్ కాయ్’ అంటూ చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి నేపాల్‌లో నడిపిన క్యాసినో దందాకు సంబంధించి ఈడీ విచారణలో పలు ఆసక్తిక అంశాలు గతంలో వెలుగులోకి వచ్చాయి. చీకోటి ప్రవీణ్ దావత్ చేస్తున్నాడంటే.. వీఐపీలు, పోలీస్ అధికారులు క్యూ కడతారన్న ప్రచారం ఉంది. 10 సంవత్సరాల క్రితమే శంషాబాద్‌లోని ఓ మహాల్‌లో సుమారు రూ. కోటి ఖర్చుతో ఆడంబరంగా కూతురు బర్త్‌డే చేసిన చరిత్ర అతడిది. తరుచుగా వీఐపీలు, అధికారులకు దావత్‌లు ఇవ్వడం అతడి అలవాటు. జూన్ 12న చంపాపేటలోని సామ సరస్వతీ గార్డెన్స్‌లో తన జన్మదిన వేడుకలు అదిరిపోయేలా జరుపుకొన్నాడు. ఇక్కడి అధికారులను గోవా, శ్రీలంక, నేపాల్ వంటి చోట్ల తాను నిర్వహించే క్యాసినోలకు తీసుకెళ్లి అదిరిపోయే ఆతిథ్యం ఇస్తాడని.. అతడి ఆతిథ్యాన్ని స్వీకరించిన వారంతా తర్వాత అతడితో సన్నిహితంగా ఉండడానికి ప్రయత్నిస్తుంటారని చెబుతారు.
Updated Date - 2022-11-16T16:45:23+05:30 IST