ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TRS MLAs poaching: ఫామ్‌హౌస్‌ ఫైల్స్‌లో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలకు అసాధారణ భద్రత

ABN, First Publish Date - 2022-11-04T19:30:38+05:30

ఫామ్‌హౌస్‌ ఫైల్స్‌లో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలకు అసాధారణ భద్రత కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు (Guvvala Balaraju, Rega Kantha Rao) రోహిత్‌‌రెడ్డి, హర్షవర్ధన్‌‌రెడ్డి మంత్రిస్థాయి భద్రత కల్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఫామ్‌హౌస్‌ ఫైల్స్‌లో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలకు అసాధారణ భద్రత కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు (Guvvala Balaraju, Rega Kantha Rao) రోహిత్‌‌రెడ్డి, హర్షవర్ధన్‌‌రెడ్డి మంత్రిస్థాయి భద్రత కల్పించారు. ఒక్కో ఎమ్మెల్యేకు 4+4 గన్‌మెన్లు ఇస్తూ హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌ (Hyderabad) నివాసంతో పాటు, సొంతూళ్లలోనూ భద్రత ఇవ్వనున్నారు. అధికార టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను రూ.400 కోట్లతో కొనుగోలు చేసేందుకు కొందరు చేసిన యత్నాన్ని సైబరాబాద్‌ పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన మధ్యవర్తులను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అంతేకాదు.. దాదాపు గంటన్నరపాటు సాగిన బేరసారాలను రహస్యంగా ఆడియో, వీడియో రికార్డింగ్‌ కూడా చేశారు. వారి నుంచి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోందిగానీ.. పోలీసులు ఆ విషయాన్ని నిర్ధారించలేదు.

దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ సంచలనం సృష్టించిన ఈ ఘటన హైదరాబాద్‌ నగర శివార్లలోని మొయినాబాద్‌ మండలం అజీజ్‌నగర్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగింది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పైలెట్‌ రోహిత్‌రెడ్డి (తాండూరు), గువ్వల బాలరాజు (అచ్చంపేట), బీరం హర్షవర్ధన్‌రెడ్డి (కొల్లాపూర్‌), రేగా కాంతారావు (పినపాక)ను ఢిల్లీకి చెందిన కొందరు వ్యక్తులు సంప్రదించారు. పార్టీ ఫిరాయిస్తే వారికి ఒక్కొక్కరికీ రూ.100 కోట్ల చొప్పున ఇస్తామని.. దాంతోపాటు కాంట్రాక్టులు కూడా ఇప్పిస్తామని ప్రలోభానికి గురిచేసేందుకు ప్రయత్నించారు. మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌‌లో ఎమ్మెల్యేలు, మధ్యవర్తుల మధ్య సంభాషణల ఆడియో, వీడియోలను టీఆర్‌ఎస్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-11-04T19:38:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising