ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

G Square Housing: గచ్చిబౌలిలో నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన జీ స్క్వేర్

ABN, First Publish Date - 2022-10-08T23:16:54+05:30

ప్రస్తుతం ఇక్కడ ఈ సంస్థకు 75 మంది ఉద్యోగులు ఉన్నారు. త్వరలోనే మరింత మందిని విధుల్లోకి తీసుకోనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్:  దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద ప్లాట్‌ ప్రమోటర్‌ జీస్క్వేర్‌ హౌసింగ్‌ లిమిటెడ్‌(G Square Housing)  గచ్చిబౌలిలో తమ నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. విశాలమైన ఈ కార్యాలయంలో 200 మందికిపైగా పనిచేసేందుకు తగిన వసతులున్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఈ సంస్థకు 75 మంది ఉద్యోగులు ఉన్నారు. త్వరలోనే మరింత మందిని విధుల్లోకి తీసుకోనున్నారు. తెలంగాణాలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టులను జీస్క్వేర్‌ చేపట్టింది.  అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న నాగార్జునసాగర్‌ రోడ్‌లోని  బీఎన్‌‌రెడ్డి నగర్‌ వద్ద ఓ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది. అలాగే త్వరలో ప్రారంభంకానున్న  మైక్రోసాఫ్ట్‌ డాటా సెంటర్‌కు సమీపంలో షాద్‌‌నగర్‌ వద్ద కూడా ఓ ప్రాజెక్ట్‌ చేపట్టింది.


నూతన కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా జీస్క్వేర్ హౌసింగ్(G Square Housing) సీఈవో ఈశ్వర్ ఎన్. మాట్లాడుతూ.. దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న  రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లలో తెలంగాణా ఒకటని అన్నారు. భారీ టెక్నాలజీ సంస్ధలన్నీ కూడా తమ క్యాంపస్‌లను ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ అద్భుతమైన వృద్ధికి అవకాశాలున్నట్టు చెప్పారు. దక్షిణ భారతదేశంలో పలు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను తాము అభివృద్ధి చేసినట్టు తెలిపారు. ఇప్పుడు తెలంగాణ మార్కెట్లోకి వచ్చినందుకు సంతోషంగా ఉన్నట్టు పేర్కొన్నారు.  

Updated Date - 2022-10-08T23:16:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising