నాణ్యమైన ధాన్యం తీసుకురావాలి
ABN, First Publish Date - 2022-11-05T23:59:58+05:30
ఆరబెట్టి ఎండిన నాణ్యమైన ధాన్యాన్నే రైతులు కొనుగోలు కేంద్రాలకు తేవాలని డీసీఎ్‌సవో వీ.వెంకటేశ్వర్లు సూచించారు. మండలంలోని ఎల్లారెడ్డిగూడెంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగో లు కేంద్రాన్ని శనివారం తనిఖీ చేశారు.
నార్కట్‌పల్లి, నవంబరు 5: ఆరబెట్టి ఎండిన నాణ్యమైన ధాన్యాన్నే రైతులు కొనుగోలు కేంద్రాలకు తేవాలని డీసీఎ్‌సవో వీ.వెంకటేశ్వర్లు సూచించారు. మండలంలోని ఎల్లారెడ్డిగూడెంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగో లు కేంద్రాన్ని శనివారం తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన రైతుల వివరాలను ఎప్పటికపుడు నమోదు చేయాలన్నారు. వర్షంవల్ల ధాన్యం తడవకుండా ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని, సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కేంద్రానికి కేటాయించిన మిల్లులకు తరలించాలన్నారు. కేంద్రాల వద్ద పూర్తి పారదర్శకత పాటించాలని, రైతులు ఇబ్బందులు పడకుండా కనీస వసతులు కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఏసీఎ్‌సవో నిత్యానందం, డీఎం నాగేశ్వర్‌రావు, సీఎస్ ఆర్‌ఐ స్వామి తదితరులు పాల్గొన్నారు.
కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతుల ధర్నా
మాడ్గులపల్లి: రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు దేవిరెడ్డి అశోక్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలోని అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై రైతుల తో కలిసి ధర్నా నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేసినప్పటికీ కాంటాలు వేసి కొనుగోలు ప్రక్రియ ప్రారంభించలేదన్నారు. అకా లవర్షాల కారణంగా ధాన్యం తడిసిపోతున్నా అధికారులు పట్టించుకోకపోవడం స రికాదన్నారు. కార్యక్రమంలో పుల్లెంల శ్రీకర్, దేవిరెడ్డి మల్లారెడ్డి, ముత్తారెడ్డి, నాగిరెడ్డి, సతీష్, సంపత్, నాగయ్యచారి, మధుసూదన్‌రెడ్డి, మాఽధవరెడ్డి పాల్గొన్నారు.
Updated Date - 2022-11-06T00:00:02+05:30 IST