ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ED IT Raides: గ్రానైట్ వ్యాపారం చాలా చిన్నది: ఎంపీ రవిచంద్ర

ABN, First Publish Date - 2022-11-10T16:22:53+05:30

గ్రానైట్ వ్యాపారం (Granite Business) చాలా చిన్నదని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర (MP Vadiraju Ravichandra) తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రానైట్ పరిశ్రమ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని, దీంట్లో కేంద్రం, ఈడీ జోక్యం అవసరం లేదన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గ్రానైట్ వ్యాపారం (Granite Business) చాలా చిన్నదని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర (MP Vadiraju Ravichandra) తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రానైట్ పరిశ్రమ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని, దీంట్లో కేంద్రం, ఈడీ జోక్యం అవసరం లేదన్నారు. ఏం జరగకుండానే.. ఏదో జరిగినట్లు ప్రచారం చేస్తున్నారని తప్పుబట్టారు. కొండను తవ్వి చిట్టెలుకను పడుతున్నారని ఎద్దేవాచేశారు. దాడులు ఆపాలని, నష్టాల్లో ఉన్న పరిశ్రమను కేంద్రం కాపాడాలని డిమాండ్ చేశారు. పారిపోయే వారికి సహాయం చేయడం కాదని, గ్రానైట్ పరిశ్రమను ఆదుకోవాలన్నారు. తమకు క్లీన్ చీట్ రావడం ఖాయమని వద్దిరాజు రవిచంద్ర తెలిపారు.

బుధవారం ఉదయం నుంచి ఈ రెండు శాఖలు సంయుక్తంగా మంత్రి నివాసం సహా.. హైదరాబాద్‌, కరీంనగర్‌లలో సోదాలు నిర్వహించాయి. ఐటీ, ఈడీ దాడుల నేపథ్యంలో సీఎం కేసీఆర్ (CM KCR) అలెర్ట్ అయ్యారు. మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రను ప్రగతిభవన్కు కేసీఆర్ పిలిపించారు. కేంద్రం ఇదే తంతు కొనసాగిస్తే చేపట్టాల్సిన చర్యలపై సమాలోచనలు చేస్తున్నారు. రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఐటీ అధికారుల సోదాలు చేశారు.

Updated Date - 2022-11-10T16:22:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising