TRS MLAs poaching case: బీఎల్ సంతోష్‌పై హైకోర్టు స్టే పొడిగింపు
ABN, First Publish Date - 2022-12-05T16:47:10+05:30
ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీఎల్ సంతోష్ (BL Santosh)పై హైకోర్టు స్టే పొడిగించింది. 41ఏ సీఆర్‌పీసీ నోటీసులపై ఈనెల 13 వరకు హైకోర్టు (High Court) స్టే పొడిగించింది.
హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీఎల్ సంతోష్ (BL Santosh)పై హైకోర్టు స్టే పొడిగించింది. 41ఏ సీఆర్‌పీసీ నోటీసులపై ఈనెల 13 వరకు హైకోర్టు (High Court) స్టే పొడిగించింది. తదుపరి విచారణ ఈనెల 13 వరకు హైకోర్టు వాయిదా వేసింది. వాస్తవానికి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు కేసులో విచారణకు హాజరుకావాలంటూ బీఎల్ సంతోష్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు నోటీసులు జారీ చేశారు. సీఆర్‌పీసీ (CRPC) 41ఏ కింద నోటీసులు జారీ చేసి నవంబర్ 21న ఉదయం పదిన్నరకు కమాండ్ కంట్రోల్‌లోని సిట్ కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు. విచారణకు హాజరుకాకపోతే అరెస్ట్ చేస్తామని నోటీసులో సిట్ అధికారులు స్పష్టం చేశారు. అయినా బీఎల్ సంతోష్ హాజరుకాలేదు. దీంతో విచారణకు రావాలంటూ సిట్ అధికారులు బీఎల్ సంతోష్‌కు మళ్లీ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపైనే హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు అరెస్ట్ చేయరాదని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు హైకోర్టు నిర్దేశించింది. సంతోష్ కూడా సీఆర్పీసీ 41ఏ నిబంధనలను పాటించాలని, సిట్ ఎదుట హాజరై దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది. నవంబర్ 21న తమ ఎదుట హాజరు కావాలంటూ సంతో్‌షకు సిట్ జారీ చేసిన నోటీసుపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది.
Updated Date - 2022-12-05T16:47:11+05:30 IST