హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం
ABN, First Publish Date - 2022-01-12T04:14:29+05:30
నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బొల్లారం, తిరుమలగిరి, కార్ఖానతో పాటు కుషాయిగూడ, సైనిక్‌పురి, మౌలాలి, చర్లపల్లి, బేగంపేట, చిలకగూడ, ప్యారడైజ్‌లో ..
హైదరాబాద్: నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బొల్లారం, తిరుమలగిరి, కార్ఖానతో పాటు కుషాయిగూడ, సైనిక్‌పురి, మౌలాలి, చర్లపల్లి, బేగంపేట, చిలకగూడ, ప్యారడైజ్‌లో గంట నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. అల్వాల్, బాలాజీనగర్, జవహర్‌నగర్‌లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపైకి వర్షపు నీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు ఇక్కట్లు పడుతున్నారు. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు సహాయ చర్యలు చేపడుతున్నారు.
Updated Date - 2022-01-12T04:14:29+05:30 IST