AP CID: మాజీ మంత్రి నారాయణ ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు
ABN, First Publish Date - 2022-11-18T14:25:37+05:30
నగరంలోని మాజీ మంత్రి నారాయణ నివాసానికి ఏపీ సీఐడీ పోలీసులు చేరుకున్నారు.
హైదరాబాద్: నగరంలోని మాజీ మంత్రి నారాయణ (Former Minister Narayana) నివాసానికి ఏపీ సీఐడీ పోలీసులు (AP CID Police) చేరుకున్నారు. హైకోర్టు ఆదేశాలతో నారాయణను సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్‌లో అవతవకలపై సీఐడీ విచారిస్తోంది. 160 సీఆర్పీసీ కింద నారాయణ (Former Minister)కు ఇప్పటికే నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా.. నారాయణ అనారోగ్యంతో బాధపడుతూ... ఇటీవల శస్త్రచికిత్స పూర్తవడంతో సీఐడీ విచారణకు హాజరుకాలేమని నారాయణ తరుపు న్యాయవాదులు హైకోర్టుకు తెలియజేశారు. దీంతో నారాయణను హైదరాబాద్లోని ఆయన స్వగృహంలో విచారించుకోవచ్చని సీఐడీకి హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో నారాయణను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు... మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీఐడీ విచారణ చేయనుంది.
Updated Date - 2022-11-18T14:28:44+05:30 IST