ED Notice: ఇకపై స్కాన్ చేస్తే చాలు..
ABN, First Publish Date - 2022-11-22T14:04:59+05:30
ఈడీ, ఎన్‌ఐఏ అధికారులమంటూ బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈడీ అధికారులు అలెర్ట్ అయ్యారు
హైదరాబాద్: ఈడీ అధికారులు(ED officials సరికొత్త విధానాన్ని పరిగణనలోకి తీసుకొచ్చారు. నోటీసు నకిలీనా? ఒరిజినలా? తెలుసుకొనేలా కొత్త విధానాన్ని అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇకపై ఈడీ కేసుల్లో నోటీసుల(scanning)ను పకడ్బందీగా జారీ అయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జారీ అయిన నోటీసు ఒరిజినలా? లేదా ఫేకా? అని గుర్తించేలా నోటీసులు ఇవ్వనున్నారు. నోటీసు కాపీ చివరిలో ‘క్యూఆర్’ కోడ్ పొందపర్చనున్నారు. నోటీసు అందుకున్న వ్యక్తి స్కాన్ చేస్తే వెంటనే వివరాలు తెలుసుకోవచ్చు. గతంలో ఈడీ, ఎన్‌ఐఏ అధికారులమంటూ బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈడీ అధికారులు అలెర్ట్ అయ్యారు. ఇకపై అలాంటి ఆందోళన అక్కర్లేదని అధికారులు అంటున్నారు.
Updated Date - 2022-11-22T14:05:00+05:30 IST