ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఆత్మ నిర్బర్‌ భారత్‌’ను అభివృద్ధి చేయాలి

ABN, First Publish Date - 2022-08-27T05:44:59+05:30

రైతు సమాజానికి సేవ చేసేందుకు విద్యార్థులు గర్వ పడాలని, ఆత్మ నిర్బర్‌ భారత్‌ను

విద్యార్థికి డిగ్రీ ప్రదానం చేస్తున్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నర్రేందసింగ్‌ తోమర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజేంద్రనగర్‌, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): రైతు సమాజానికి సేవ చేసేందుకు విద్యార్థులు గర్వ పడాలని, ఆత్మ నిర్బర్‌ భారత్‌ను అభివృద్ధి చేయడంలో విద్యార్థుల పాత్ర ఎంతో అవసరమని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ అన్నారు. రాజేంద్రనగర్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఎక్స్‌టెన్షన్‌ మేనేజ్‌మెంట్‌(మేనేజ్‌)లో శుక్రవారం పోస్ట్‌ గ్రాడ్యుయేట్స్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌) 6వ స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ పాల్గొ ని 2018 నుంచి 2022 వరకు మూడు బ్యాచ్‌లకు చెందిన 202మంది విద్యార్థులకు పట్టాలను అందజేశారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 9 మంది విద్యార్థులు బంగారు, 9మంది విద్యార్థులు వెండి, కాంస్య పతకాలను అందుకున్నారు. తమ అగ్రివెంచర్ల ద్వారా రైతు సమాజానికి సహకరిస్తున్న ముగ్గురు మేనేజ్‌ పూర్వ విద్యార్థులకు అవార్డుల ను అందజేశారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకురావాలన్నారు. నూతన సాంకేతికతను అభివృద్ధి చేసుకుంటూ వ్యవసాయంపై ఆధారపడిన వారికి మేలు చేయాలన్నారు. వ్యవసాయ రంగంలో డిజిటల్‌ అగ్రికల్చరల్‌ మిషన్‌ బాగా పనిచేస్తోందని గుర్తు చేశారు. పట్టాలు పొందిన విద్యార్థులను అభినందించారు. మేనేజ్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ పి.చంద్రశేఖర మాట్లాడుతు 1987లో మేనేజ్‌ స్థాపించడం జరిగిందన్నారు. 35సంవత్సరాలుగా రైతు సేవలో ముందుంటున్నామని, ఇప్పటి వరకు 6లక్షల మంది అధికారులకు శిక్షణ ఇచ్చామన్నారు. కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్‌ అహు జా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెడల్స్‌ అందజేశారు. 

బంగారు పతకాలు గెలుచుకున్న విద్యార్థులు

అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించిన వారిలో జోసన్‌ టి జోసెఫ్‌, ఆర్‌.విష్ణువర్ధన్‌, సాయక్‌ చక్రబర్తి, ఎం.స్టీఫెన్‌ చక్రవర్తి, సప్తపర్ణ కరుణాకర్‌, డాక్టర్‌ నవ్రీత్‌ బంగారు పతకాలు గెలుచుకున్నారు. వెండి పతకాలు సాధించిన వారిలో ఎస్‌.మోహన్‌రామ్‌, హర్మన్‌కౌర్‌ చావ్లా, నిఖిత జే, సి.శ్రీలక్ష్మి, యషన్‌జిత్‌ సింగ్‌, కాంస్య పతకాలు సాధించిన వారిలో అమిత్‌కుమార్‌ సాహు, భూషణ్‌, ఎస్‌.భానుమతి, ప్రవీణ్‌ సెబాస్టీయన్‌, కేతన్‌ అశోక్‌ సాహు ఉన్నారు. 




Updated Date - 2022-08-27T05:44:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising