Delhi Liquor Scam: కవితను ఇంట్లో ఒక గదిలో విచారిస్తున్న సీబీఐ
ABN, First Publish Date - 2022-12-11T11:33:55+05:30
ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam)లో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)ను విచారణ చేయడానికి సీబీఐ (CBI) బృందం ఆదివారం ఉదయం 11 గంటలకు బంజారాహిల్స్‌లోని ఆమె నివాసానికి చేరుకున్నారు.
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam)లో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)ను విచారణ చేయడానికి సీబీఐ (CBI) బృందం ఆదివారం ఉదయం 11 గంటలకు బంజారాహిల్స్‌లోని ఆమె నివాసానికి చేరుకున్నారు. ఇంటోని ఒక గదిలో ఐదుగురు సీబీఐ అధికారులు కవితను విచారిస్తున్నారు. నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్‌ను కవిత ముందు పెట్టి.. అమిత్ అరోరా స్టేట్మెంట్ ఆధారంగా విచారణ చేసి, స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు. కాగా సీబీఐ అధికారులు రెండు వాహనాలతో కవిత నివాసానికి వచ్చారు. న్యాయవాదుల సంక్షంలోనే అధికారులు కవితను విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో కవిత ఇంటి పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ఉండడంతో 160 సీఆర్పీసీ కింద సీబీఐ కవితకు నోటీసులను జారీ చేసింది. కాగా ఈ నెల 6వ తేదీన కవితను సీబీఐ అధికారులు విచారించాల్సింది. అయితే ఇతర కార్యక్రమాల్లో ఆమె బిజీగా ఉండటంతో 11వ తేదీన అందుబాటులో ఉంటానని సీబీఐకి సమాచారం ఇచ్చారు. ప్రస్తుతానికి ఈ కేసులో కవితను సాక్షిగానే సీబీఐ అధికారులు ప్రశ్నిస్తారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కాగా ఇప్పటికే ప్రగతిభవన్‌లో న్యాయ నిపుణులతో పాటు తండ్రి సీఎం కేసీఆర్‌తో కవిత నోటీసులపై చర్చించిన విషయం తెలిసిందే.
Updated Date - 2022-12-11T11:38:31+05:30 IST