Golkonda kotaపై జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
ABN, First Publish Date - 2022-08-15T16:26:19+05:30
తెలంగాణ రాష్ట్రంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో స్వాతంత్య్ర దినోత్సవ (Independence day) వేడుకలు ఘనంగా నిర్వహించారు. గోల్కండ కోట (Golkonda kota)పై ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) జాతీయ జెండా (National flag)ను ఆవిష్కరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి సీఎం ప్రసంగిస్తూ... రాష్ట్రం అపూర్వ విజయాలను సొంతం చేసుకుంటోందన్నారు. ఆర్థికరంగంలో తెలంగాణ (Telangana) దూసుకెళ్తోందని తెలిపారు. ప్రతి ఇంటిపై జాతీయజెండా ఎగురవేయాలని పిలుపునిచ్చామని, రాష్ట్రంలో 1.20 కోట్ల జాతీయ జెండాలు పంచామని అన్నారు. మహనీయుల త్యాగాల వల్లే స్వాతంత్ర్య ఫలాలు అనుభవిస్తున్నామని చెప్పారు. అహింసా పద్ధతిలోనే తెలంగాణ సాధించుకున్నామన్నారు. సంక్షేమంలో రాష్ట్రం స్వర్ణయుగాన్ని ఆవిష్కరించిందని ముఖ్యమంత్రి తెలిపారు.
ఆసరా కింద కొత్తగా మరో 10 లక్షల పెన్షన్లు పంపినీ చేశామన్నారు. దళితబంధును సామాజిక ఉద్యమంగా అమలుచేస్తున్నామని అన్నారు. ఇప్పటివరకు 40 వేల కుటుంబాలకు దళితబంధు అందజేసినట్లు తెలిపారు. ఈ ఏడాది మరో 1.70 లక్షల కుటుంబాలకు దళితబంధు అందజేస్తామన్నారు. ఏడేళ్లలో సొంత పన్నుల ఆదాయంలో తెలంగాణ నెంబర్‌వన్‌గా నిలిచిందని చెప్పారు. హరితహారంతో తెలంగాణ ఆకుపచ్చగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికక్రమశిక్షణ పాటిస్తోందని అన్నారు. ప్రజాసంక్షేమం ప్రభుత్వాల ప్రధాన బాధ్యతని తెలిపారు. ప్రజాసంక్షేమ బాధ్యతను కేంద్రం సరిగా నిర్వహించడం లేదని విమర్శించారు. కేంద్రం నిర్వాకం వల్లే దేశ ఆర్థికాభివృద్ధి కుంటుపడిందని కేసీఆర్ వ్యాఖ్యలు రాశారు.
Updated Date - 2022-08-15T16:26:19+05:30 IST