strategist Sunil: తనిఖీలపై హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్
ABN, First Publish Date - 2022-12-14T15:43:09+05:30
తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్(Telangana Congress strategist Sunil) కనుగోలు ఆఫీస్ తనిఖీలపై కాంగ్రెస్ పార్టీ హైకోర్టు(High Court)ను ఆశ్రయించింది. పోలీసుల అదుపులో
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్(Telangana Congress strategist Sunil) కనుగోలు ఆఫీస్ తనిఖీలపై కాంగ్రెస్ పార్టీ హైకోర్టు(High Court)ను ఆశ్రయించింది. పోలీసుల అదుపులో ఉన్న ఇషాన్, శశాంక్, మాంధ జాడ చెప్పాలంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. ముగ్గురి కోసం హాబీస్ కార్పస్ పిటిషన్‌ను మాజీ ఎంపీ మల్లు రవి(Former MP Mallu Ravi) దాఖలు చేశారు. కనీస సమాచారం లేకుండా ముగ్గురిని పట్టుకెళ్లారని పిటిషన్‌లో తెలిపారు. మరోవైపు సైబర్ క్రైమ్ పోలీసుల అదుపులో ఉన్న వారిని వదిలిపెట్టేందుకు పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చి వదిలిపెట్టనున్నారు.
మరోవైపు హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీసీసీ ముట్టడికి కాంగ్రెస్ నాయకురాలు విజయారెడ్డి(Vijaya Reddy) యత్నించారు. అడ్డుకున్న పోలీసులు బలవంతంగా వ్యాన్‌లో ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్రమ అరెస్టులు ఆపాలంటూ విజయారెడ్డి నినాదాలు చేశారు.
మాదాపూర్‌లోని సునీల్ కనుగోలు కార్యాలయాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు సీజ్ చేశారు. ఆపన్న ఆస్తం పేరుతో సోషల్ మీడియాలో అకౌంట్ ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత పోస్ట్‌లు పెట్టారంటూ ఐదు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. మూడు కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లను పోలీసులు సీజ్ చేశారు.
Updated Date - 2022-12-14T15:58:24+05:30 IST