ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Narayana: కవిత విచారణను లైవ్‌లో పెట్టండి..

ABN, First Publish Date - 2022-12-11T14:57:05+05:30

హైదరాబాద్: కవిత (Kavitha) సీబీఐ (CBI) విచారణ పారదర్శకంగా జరగాలని సీపీఐ నేత నారాయణ (Narayana) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కవిత (Kavitha) సీబీఐ (CBI) విచారణ పారదర్శకంగా జరగాలని సీపీఐ నేత నారాయణ (Narayana) అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కోర్టు విచారణలే లైవ్‌ (Live)లో చూపిస్తున్నారని, కవిత విచారణను కూడా లైవ్‌లో చూపించాలన్నారు. బీజేపీ (BJP) కావాలనే విపక్ష నేతలపై దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. కేంద్రం ఈడీ (ED), సీబీఐ (CBI)లతో రాజకీయ కక్ష సాధింపు చర్యగా రాజకీయ ప్రత్యర్ధులపై దాడులు చేయిస్తోందని విమర్శించారు. ఈ నేపథ్యంలో కవిత సీఎం కేసీఆర్ (CM KCR) కుమార్తె కాబట్టి కక్ష సాధింపు చర్యలకు దిగారని.. అందుకే జరుగుతున్న విచారణ లైవ్ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ బృందం విచారిస్తోంది. న్యాయవాది సమక్షంలో కవిత స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డు చేస్తున్నారు. కవితను విచారణ చేయడానికి సీబీఐ (CBI) బృందం ఆదివారం ఉదయం 11 గంటలకు బంజారాహిల్స్‌లోని ఆమె నివాసానికి చేరుకున్నారు. ఇంటోని ఒక గదిలో ఐదుగురు సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు. నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్‌ను కవిత ముందు పెట్టి.. అమిత్ అరోరా స్టేట్మెంట్ ఆధారంగా విచారణ చేసి, స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తున్నారు. న్యాయవాదుల సంక్షంలోనే అధికారులు కవితను విచారిస్తున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో అరెస్టయిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ఉండడంతో 160 సీఆర్పీసీ కింద సీబీఐ కవితకు నోటీసులను జారీ చేసింది. కాగా ఈ నెల 6వ తేదీన కవితను సీబీఐ అధికారులు విచారించాల్సింది. అయితే ఇతర కార్యక్రమాల్లో ఆమె బిజీగా ఉండటంతో 11వ తేదీన అందుబాటులో ఉంటానని సీబీఐకి సమాచారం ఇచ్చారు. ప్రస్తుతానికి ఈ కేసులో కవితను సాక్షిగానే సీబీఐ అధికారులు ప్రశ్నిస్తారని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

Updated Date - 2022-12-11T14:57:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising