ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi Liquor Scam: గంటన్నరకుపైగా కొనసాగుతున్న కవిత విచారణ

ABN, First Publish Date - 2022-12-11T14:11:24+05:30

హైదరాబాద్: డీఐజీ ర్యాంక్ అధికారి రాఘవేంద్ర వత్స నేతృత్వంలో టీఆర్ఎస్ (TRS) ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)ను విచారిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: డీఐజీ ర్యాంక్ అధికారి రాఘవేంద్ర వత్స నేతృత్వంలో టీఆర్ఎస్ (TRS) ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)ను విచారిస్తున్నారు. విచారణ టీమ్‌లో ఓ మహిళ అధికారి ఉన్నారు. గంటన్నరకుపైగా విచారణ కొనసాగుతోంది. మహిళా అధికారులతో సహా మొత్తం 11మంది అధికారులు కవిత నివాసానికి వచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ప్రత్యేక గదిలో ఆమెను విచారిస్తున్నారు. సీబీఐ ఉన్నతాధికారులు సిద్ధం చేసిన ప్రశ్నావలిని ముందుంచి ప్రశ్నిస్తున్నారు. కొన్ని డాక్యుమెంట్లు, కాల్ లిస్ట్‌పై అధికారులు విచారిస్తున్నారు. సిసోడియా, అరోరా, అభిషేక్ విషయంలో కూడా కవితను ప్రశ్నిస్తున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ (Delhi Liquor Scam)లో ఎమ్మెల్సీ కవితను విచారణ చేయడానికి సీబీఐ (CBI) బృందం ఆదివారం ఉదయం 11 గంటలకు బంజారాహిల్స్‌లోని ఆమె నివాసానికి చేరుకున్నారు. ఇంటోని ఒక గదిలో ఐదుగురు సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు. నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్‌ను కవిత ముందు పెట్టి.. అమిత్ అరోరా స్టేట్మెంట్ ఆధారంగా విచారణ చేసి, స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు. కాగా సీబీఐ అధికారులు రెండు వాహనాలతో కవిత నివాసానికి వచ్చారు. న్యాయవాదుల సంక్షంలోనే అధికారులు కవితను విచారిస్తున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో అరెస్టయిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ఉండడంతో 160 సీఆర్పీసీ కింద సీబీఐ కవితకు నోటీసులను జారీ చేసింది. కాగా ఈ నెల 6వ తేదీన కవితను సీబీఐ అధికారులు విచారించాల్సింది. అయితే ఇతర కార్యక్రమాల్లో ఆమె బిజీగా ఉండటంతో 11వ తేదీన అందుబాటులో ఉంటానని సీబీఐకి సమాచారం ఇచ్చారు. ప్రస్తుతానికి ఈ కేసులో కవితను సాక్షిగానే సీబీఐ అధికారులు ప్రశ్నిస్తారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కాగా ఇప్పటికే ప్రగతిభవన్‌లో న్యాయ నిపుణులతో పాటు తండ్రి సీఎం కేసీఆర్‌తో కవిత నోటీసులపై చర్చించిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-12-11T14:11:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising