Hyderabad: మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్‌ను సందర్శించనున్న రాష్ట్రపతి
ABN, First Publish Date - 2022-12-27T11:25:15+05:30
హైదరాబాద్: శీతాకాలం విడితికి హైదరాబాద్ వచ్చిన భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Draupadi Murmu) మంగళవారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు.
హైదరాబాద్: శీతాకాలం విడితికి హైదరాబాద్ వచ్చిన భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Draupadi Murmu) మంగళవారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. కంచన్‌బాగ్‌లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (Misra Dhatu Nigam Ltd)ను సందర్శించనున్నారు. తర్వాత కేశవ్ మెమోరియల్ కాలేజ్ (Keshav Memorial College) విద్యార్థులతో రాష్ట్రపతి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీ (Police Academy)కి వెళ్లనున్నారు. ఎన్‌పిఏ (NPA)లో ఐపీఎస్ బ్యాచ్ శిక్షణ అధికారులతో ముఖాముఖి మాట్లాడతారు. సాయంత్రం మిధానిలో వైడ్ ఫ్లైట్ మిల్లు (Wide Flight Mill)ను ప్రారంభిస్తారు. బుధవారం భద్రాచలం (Bhadrachalam) రామయ్యను రాష్ట్రపతి దర్శించుకుని.. ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. శీతాకాలం విడిదిలో భాగంగా నగరానికి విచ్చేసిన ద్రౌపదీ ముర్ము ఐదు రోజులపాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. ఈ నెల 30వ తేదీ వరకు తెలంగాణలో ఉండనున్న రాష్ట్రపతి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
Updated Date - 2022-12-27T11:25:18+05:30 IST