ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సైబర్‌ నేరాలపై అందరికీ అవగాహన కల్పించాలి

ABN, First Publish Date - 2022-12-04T00:39:34+05:30

సైబర్‌ యోధాలు సైబర్‌ నేరాలపై అందరికీ అవగాహన కల్పించాలని రాచకొండ సైబర్‌ సెల్‌ ఏసీపీ హరినాథ్‌ సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 26(ఆంధ్రజ్యోతి): సైబర్‌ యోధాలు సైబర్‌ నేరాలపై అందరికీ అవగాహన కల్పించాలని రాచకొండ సైబర్‌ సెల్‌ ఏసీపీ హరినాథ్‌ సూచించారు. శనివారం శివకారాడి ఆధ్వర్యంలో 80మంది సైబర్‌ యోధాలు ఎల్బీనగర్‌ సైబర్‌ పీఎస్‌ను సందర్శించారు. సైబర్‌ క్రైమ్‌ ఫిర్యాదుల నమోదు, ఎఫ్‌ఐఆర్‌, నేరాల దర్యాప్తులో, పరిశోధనలో వాడే వివిధ పద్ధతులు తదితర అంశాలపై ఇన్‌స్పెక్టర్లు అవగాహన కల్పించారు. ఈ సం దర్భంగా ఏసీపీ హరినాథ్‌ మాట్లాడుతూ సైబర్‌ నేరాల నివారణకు నేరాల తీరుపై అవగాహనే ప్రధానమన్నారు. రాచకొండ సైబర్‌ సెల్‌ ఆధ్వర్యంలో సోషల్‌ మీడియా వేదికల్లోనూ సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్లు జే.నరేందర్‌గౌడ్‌, ఏ.నందీశ్వర్‌ రెడ్డి, ఎన్‌.రాము, బీ.రాజు, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్‌ సంయుక్త కార్యదర్శి, ఎండ్‌ నౌ వ్యవస్థాపకులు అనిల్‌ రాచమల్ల, ఛీఫ్‌ కో ఆర్డినేటర్‌ ఎం.సావిత్రి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-04T00:39:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising