ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్యం మత్తుకు నలుగురు జలసమాధి

ABN, First Publish Date - 2022-10-29T02:39:50+05:30

మహబూబాబాద్‌ జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో వాహనాన్ని నడిపిన ఓ డ్రైవర్‌ నిర్లక్ష్యం నలుగురిని జలసమాధి చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన కారు.. నీళ్లలో మునిగి నలుగురి దుర్మరణం

మృతుల్లో లిఫ్ట్‌ అడిగి ఎక్కిన తల్ల్లీకొడుకులు

మహబూబాబాద్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం

ఇద్దరిని కాపాడిన పదో తరగతి విద్యార్థులు

కేసముద్రం, అక్టోబరు 28 : మహబూబాబాద్‌ జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో వాహనాన్ని నడిపిన ఓ డ్రైవర్‌ నిర్లక్ష్యం నలుగురిని జలసమాధి చేసింది. కేసముద్రం బైపాస్‌ రోడ్డులోని ఓ మలుపు వద్ద అదుపు తప్పిన కారు రోడ్డుకు ఆనుకుని ఉన్న వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఇందులో ఇద్దరు దంపతులు కాగా మరో ఇద్దరు తల్లీకొడుకులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గోలియాతండాకు చెందిన దంపతులు బానోత్‌ భద్రు(40), అచ్చాలి(33), వారి కూతురు మాలోత్‌ సుమలత, మనవడు దీక్షిత్‌(2) శుక్రవారం ఉదయం వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీ్‌ఫకు వెళ్లారు. అచ్చాలి సోదరుడు, ఇల్లందు మండలం టేకులపల్లికి చెందిన గుగులోత్‌ బిక్కు కారులో వెళ్లిన వీరంతా బంధువులు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే కార్యక్రమంలో పాల్గొన్న మహబూబాబాద్‌కు చెందిన తల్లీకొడుకులు గుగులోత్‌ లలిత(40), సురేష్‌(14) మానుకోటలో దిగుతామని చెప్పి తిరుగు ప్రయాణంలో వీళ్ల కారు ఎక్కారు. అన్నారం, ఇనుగుర్తి మీదుగా మహబూబాబాద్‌ వస్తున్న ఆ కారు సాయంత్రం ఆరు గంటల సమయంలో ప్రమాదానికి గురైంది.

కేసముద్రం బైపాస్‌ రోడ్డులోని ఓ మలుపు వద్ద అదుపు తప్పి రోడ్డుకు ఆనుకుని ఉన్న వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ప్రమాదాన్ని గుర్తించిన కారు డ్రైవర్‌ బిక్కు ముందుగా బయటకు దూకేశాడు. కారు బావిలో మునుగుతుండగా ఇద్దరు పదో తరగతి విద్యార్థుల సాయంతో సుమ, ఆమె కొడుకుని తీసుకుని బయటికి దూకింది. అనంతరం కారు బావిలో మునిగిపోగా ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు తొలుత లలిత, అచ్చాలి మృతదేహాలను వెలికితీశారు. అనంతరం ఎక్స్‌కవేటర్‌ సాయంతో రెండు గంటల పాటు శ్రమించి కారును వెలికి తీయగా భద్రు, సురేష్‌ మృతదేహాలు అందులో లభ్యమయ్యాయి. అయితే, డ్రైవర్‌ బిక్కు మద్యం మత్తులో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బిక్కును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఆ చిన్నారులు సాహస వీరులు..

ఈ ప్రమాదంలో సురక్షితంగా బయటపడిన సుమలత, ఆమె రెండేళ్ల కొడుకు దీక్షిత్‌ను ఇద్దరు పదో తరగతి విద్యార్థులు రక్షించారు. ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సిద్దూ, రంజిత్‌ ఘటనా స్థలికి సమీపంలో మూత్ర విసర్జనకు వచ్చారు. ప్రమాదాన్ని చూసిన వారిద్దరూ వెంటనే అక్కడికి చేరుకున్నారు. డ్రైవర్‌ బిక్కు బయటకు దూకడాన్ని చూసిన వారు సుమ, దీక్షిత్‌ను కూడా గమనించారు. వెంటనే అక్కడ దొరికన తాడు వేసి వాళ్లని బయటికి లాగారు. అంతేకాక, మిగిలిన వాళ్లని కాపాడేందుకు కారు అద్దాలు పగలుకొట్టేందుకు విఫలయత్నం చేశారు. కానీ క్షణాల్లోనే ఆ కారు నీట మునిగింది. ఏదేమైనా రెండు నిండు ప్రాణాలను రక్షించేందుకు సిద్దూ, రంజిత్‌ చేసిన సాహసం తెలుసుకుని స్థానికులు అభినందించారు.

Updated Date - 2022-10-29T02:39:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising