Nagavardhini: ‘సీరియల్’లో నటించే నాగవర్ధిని ఎంత ఘోరం చేసిందో చూడండి..
ABN, First Publish Date - 2022-11-01T19:55:04+05:30
టీవీ సీరియల్స్‌లో జరిగే ట్విస్ట్‌లు నిజ జీవితంలో జరిగితే ఎలా ఉంటుంది? హైదరాబాద్‌లో (Hyderabad) అచ్చం అలానే జరిగింది. అయితే.. ఇందులో పాత్రధారులు, సూత్రధారులు కూడా..
హైదరాబాద్: టీవీ సీరియల్స్‌లో జరిగే ట్విస్ట్‌లు నిజ జీవితంలో జరిగితే ఎలా ఉంటుంది? హైదరాబాద్‌లో (Hyderabad) అచ్చం అలానే జరిగింది. అయితే.. ఇందులో పాత్రధారులు, సూత్రధారులు కూడా టీవీ సీరియల్స్‌లో (Telugu TV Serials) నటిస్తున్న వారే కావడం కొసమెరుపు. గుప్పెడంత మనసు (Guppedanta Manasu), గుండమ్మ కథ (Gundamma Katha) సీరియల్స్‌లో నటిస్తున్న నాగవర్ధిని (Nagavardhini) హైదరాబాద్‌లో ఉంటోంది. నాలుగేళ్లుగా సూర్య అనే అతనితో కలిసి ఒకే రూమ్‌లో ఉంటోంది. అయితే.. నాలుగు నెలల క్రితం సూర్య స్నేహితుడు శ్రీను కూడా అదే రూంకి వచ్చి వాళ్లతో పాటు ఉంటున్నాడు. కొన్ని రోజులకు శ్రీనుతో నాగవర్ధిని సన్నిహితంగా ఉండటం మొదలుపెట్టింది. ఇద్దరి మధ్య చనువు పెరిగింది. ఎలాగైనా సూర్యను చంపేసి అడ్డు తొలగించుకోవాలని భావించిన నాగవర్ధిని, శ్రీను కలిసి సూర్యను బిల్డింగ్ పై నుంచి కిందకు తోసేశారు. ఈ ఘటనలో సూర్య తీవ్రంగా గాయపడ్డాడు. సూర్యను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులను బంజారాహిల్స్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నాగవర్ధిని ఇన్నాళ్లు యూసఫ్‌గూడలో ఈ ఇద్దరితో కలిసి రూంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సూర్యతో నాగవర్ధిని గత నాలుగేళ్లుగా సహ జీవనం చేస్తున్నట్లు విచారణలో తేలింది.
యూసఫ్‌గూడలోని (Yousafguda) ఒక అపార్ట్‌మెంట్‌లోని రెండో అంతస్తులో ఇద్దరూ ఉండేవారు. సూర్య కూడా సీరియల్స్‌లో నటిస్తున్నాడు. సూర్య స్నేహితుడు శ్రీనుతో నాగవర్ధిని అఫైర్ పెట్టుకున్న విషయం సూర్యకు తెలిసింది. దీంతో.. ఇద్దరినీ మందలించాడు. అప్పటి నుంచి తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇక.. వాళ్లిద్దరితో కలిసి ఉండలేనని నిర్ణయించుకున్న సూర్య అదే అపార్ట్‌మెంట్‌లోని నాలుగో అంతస్తుకు మారాడు. రెండో అంతస్తులో అప్పటి నుంచి శ్రీను, నాగవర్ధిని కలిసి ఉంటున్నారు. అయినప్పటికీ గత రెండు రోజులుగా నాగవర్ధిని విషయంలో సూర్య, శ్రీను మధ్య గొడవ జరిగాయి. నాగవర్ధిని కూడా శ్రీనుకు వత్తాసు పలకడంతో సూర్య తట్టుకోలేకపోయాడు. శ్రీను, నాగవర్ధిని కలిసి ఉంటున్న రెండో అంతస్తుకు వెళ్లి గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే నాగవర్ధిని, శ్రీను కలిసి ఈ ఘోరానికి పాల్పడ్డారు.
Updated Date - 2022-11-01T23:22:35+05:30 IST