ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyd Flight Restaurant: హైదరాబాద్‌ ఫ్లైట్‌ రెస్టారెంట్‌ గురించి ఏ టూ జెడ్ మీకోసం...

ABN, First Publish Date - 2022-11-27T20:22:07+05:30

చుట్టూ రన్‌ వే... ఎయిర్‌పోర్ట్‌ తరహా ఏర్పాట్లు మధ్యలో పెద్ద ఫ్లైట్‌! ఆ ఫ్లైట్‌లో కూర్చొని విందు భోజనం చేసే వారికి వింత అనుభూతి.. ఆనందం. ఇందుకు మనం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శామీర్‌పేటలో ఫ్లైట్‌ రెస్టారెంట్‌!

నగర శివార్లలో మొదటిది

బోర్డింగ్‌ పాస్‌ టికెట్లు.. మినీ రన్‌ వే

కస్టమర్లకు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన అనుభూతి

త్వరలో ప్రారంభించనున్న ‘పిస్తా హౌజ్‌’ యాజమాన్యం

మేడ్చల్‌ (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): చుట్టూ రన్‌ వే (Runway)... ఎయిర్‌పోర్ట్‌ (Airport) తరహా ఏర్పాట్లు మధ్యలో పెద్ద ఫ్లైట్‌ (Big Flight)! ఆ ఫ్లైట్‌లో కూర్చొని విందు భోజనం చేసే వారికి వింత అనుభూతి.. ఆనందం. ఇందుకు మనం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు పోవాల్సిన పనిలేదు. విమానమే వినియోగదారుల కోసం అందుటులోకి రానుంది. ఫ్లైట్‌ థీమ్‌ రెస్టారెంట్‌తో (Flight Theme Restaurant) ఇది అందుబాటులోకి రానుంది. గతంలో మనం ట్రైన్‌ థీమ్‌ రెస్టారెంట్‌, ఆకాశంలో భోజనం చేసేలా ఏర్పాట్లు లాంటివి చూశాం. జైలు గదుల్లో కూర్చొని తినే అనుభూతినీ కొన్ని రెస్టారెంట్లు కల్పించాయి. ఆ మధ్య విజయవాడలో ఓ పాత విమానాన్ని కొని దానిలో రెస్టారెంట్‌ ఏర్పాటు చేశారు. ఇప్పుడు హైదరాబాద్‌ సమీపంలోనూ విమాన రెస్టారెంట్‌ ఏర్పాటు కాబోతోంది.

ప్రముఖ రెస్టారెంట్ల నిర్వహణా సంస్థ ‘పిస్తా హౌజ్‌’ (Pista House) ఈ ఫ్లైట్‌ రెస్టారెంట్‌ను కొద్ది రోజుల్లో వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది. నగర శివారు మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట (Shamirpet) ప్రాంతంలో ఫ్లైట్‌ రెస్టారెంట్‌ను (Flight Restaurant) ప్రారంభించనున్నారు. కొద్ది నెలల క్రితమే పిస్తాహౌజ్‌ యాజమాన్యం ఎయిర్‌ ఇండియా సంస్థ నుంచి మొట్టమొదటి ఎయిర్‌ బస్‌-320 పాత విమానాన్ని కొంది. దాన్ని భారీ ట్రాలీలో శామీర్‌పేటకు తెచ్చేశారు కూడా! ఈ ఎయిర్‌బస్‌ ఎ-320 విమానం దేశంలోని ఆ తరగతికి చెందిన విమానాల్లో మొదటిది. ప్రస్తుతం దానికి రెన్యూవేషన్‌ పనులు చేస్తున్నారు. త్వరలోనే రాష్ట్రంలో తొలి ఫ్లైట్‌ రెస్టారెంట్‌ ప్రారంభం కానుంది. విమానాన్ని ఇక్కడికి తెస్తున్న క్రమంలో ఏపీలోని ఓ చోట తక్కువ ఎత్తున్న అండర్‌ పాస్‌ దాటాల్సి వచ్చింది. అక్కడి పోలీసులు, స్థానికుల సహకారంతో మరో దారిలో విమానాన్ని తరలించామని నిర్వాహకులు తెలిపారు. ఫ్లైట్‌ బాడీని విడి భాగాలు చేసి తెచ్చినట్టు చెప్పారు. ఇక్కడికి తెచ్చాక ఆ స్పేర్స్‌ బిగించారు. ఈ పాత విమానాన్ని రూ.75 లక్షలకు కొన్నట్టు తెలుస్తోంది. అదనంగా రూ.30 లక్షల నుంచి 40లక్షల వరకూ ఇంటీరియర్‌ డిజైనింగ్‌ కోసం ఖర్చు చేస్తున్నారు. వచ్చే నెలలో రెస్టారెంట్‌ను అందుబాటులోకి తేనున్నట్టు పిస్తా హౌస్‌ నిర్వాహకులు పేర్కొన్నారు.

ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన అనుభూతి

హైదరాబాద్‌కు ఫ్లైట్‌ రెస్టారెంట్‌ అనే కాన్సె్‌ప్టను పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. హైదరాబాద్‌ వాసులు వినూత్నకు పెద్దపీట వేస్తారు. ఆ ఆలోచనలతో ఇప్పుడు మేం ఫ్లైట్‌ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేయబోతున్నాం అని నిర్వాహకులు తెలిపారు.

బోర్డింగ్‌ పాస్‌ టికెట్లు

విమాన రెస్టారెంట్‌ పరిసరాలు ఎయిర్‌పోర్టును పోలి ఉండేలా ఉండేలా డిజైన్‌ చేస్తున్నారు. విమానాన్ని ఉంచే స్థలంలో మినీ రన్‌వేనూ తయారు చేశారు. రెస్టారెంట్‌కు వచ్చే ముందు ఇచ్చే టికెట్లు సేమ్‌ బోర్డింగ్‌ పాసుల్లాగానే ఉంటాయి. కస్టమర్లు చెకప్‌ చేసుకొని ఈ ఫ్లైట్‌ రెస్టారెంట్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది.

Updated Date - 2022-11-27T20:22:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising