Pawan kalyan: కృష్ణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి
ABN, First Publish Date - 2022-09-28T16:05:52+05:30
ప్రముఖ నటులు సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్‌బాబు మాతృమూర్తి ఇందిరాదేవి మృతి పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: ప్రముఖ నటులు సూపర్ స్టార్ కృష్ణ (Krishna) సతీమణి, మహేష్‌బాబు (Mahesh babu) మాతృమూర్తి ఇందిరాదేవి (Indiradevi) మృతి పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) విచారం వ్యక్తం చేశారు. ఇందిరాదేవి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ బాధ నుంచి కృష్ణ, మహేష్ బాబు త్వరగా కోలుకునే మనో ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు.
Updated Date - 2022-09-28T16:05:52+05:30 IST