ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: టీటీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కాసాని జ్ఞానేశ్వర్

ABN, First Publish Date - 2022-11-10T15:48:11+05:30

హైదరాబాద్ (Hyderabad): తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ (Kasani Gnaneshwar Mudiraj) బాధ్యతలు స్వీకరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad): తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ (Kasani Gnaneshwar Mudiraj) బాధ్యతలు స్వీకరించారు. గురువారం, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) సమక్షంలో కాసాని బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నడిబొడ్డులో టీడీపీ పుట్టిందన్న విషయం మర్చిపోవద్దన్నారు. ‘చంద్రబాబు అంటే క్షమశిక్షణ... క్రమశిక్షణ అంటే చంద్రబాబు’ అని అన్నారు. దివంగత సీనియర్ ఎన్టీఆర్ పిలుపుతో అన్ని జిల్లాల యువత టీడీపీ జెండా పట్టుకున్నారని, తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తెచ్చేందుకు గ్రామ గ్రామన తిరుగుతానన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు చేసిన అభివృద్ధి పనులే మనకు ఎజెండా అని, చంద్రబాబు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని

నిలబెట్టుకుంటానని కాసాని‌ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ స్పష్టం చేశారు.

కాగా తెలంగాణ టీడీపీ కొత్త అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న బక్కని నర్సింహులును పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు టీడీపీ పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. ఆయన స్థానంలో కాసానిని కొత్త అధ్యక్షుడిగా నియమించారు. బక్కని నర్సింహులును జాతీయ కార్యదర్శిగా నియమించారు. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడిగా ఉన్న ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో హైదరాబాద్‌లో టీడీపీలో చేరారు. కాసాని 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కాసాని గతంలో ఎమ్మెల్సీగా, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మెన్ గానూ పనిచేశారు.గురువారం

Updated Date - 2022-11-10T16:12:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising