Kavitha: ప్రగతి భవన్‌కు ఎమ్మెల్సీ కవిత.. మరోసారి సీఎం కేసిఆర్‌తో భేటీ
ABN, First Publish Date - 2022-12-04T11:00:50+05:30
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ నుంచి నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ కవిత ఆదివారం ఉదయం మరోసారి ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు.
హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు (Delhi Liquor Case)లో సీబీఐ (CBI) నుంచి నోటీసులు అందుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha).. ఈ విచారణను ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై తన తండ్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR)తో నిన్న చర్చలు జరిపారు. ఆదివారం ఉదయం మరోసారి కవిత ప్రగతి భవన్‌కు వచ్చారు. సీఎం కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని, డాక్యుమెంట్స్ పంపిన తర్వాతే విచారణ తేదీ ఫిక్స్ చేయాలని కవిత నిన్న సీబీఐకు లేఖ రాశారు. అయితే సీబీఐ నుంచి ఇంకా సమాధానం రాలేదు. సీబీఐ సమాధానం కోసం కవిత ఎదురుచూస్తున్నారు. సీఎం కేసీఆర్‌తో సమావేశం అనంతరం నేరుగా ఆలేర్‌కు వెళ్లనున్నారు. కవిత దంపతులు అక్కడ ఓ వివాహానికి హాజరుకానున్నారు.
Updated Date - 2022-12-04T11:00:53+05:30 IST