ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi: ఈడీ ఎదుట హాజరైన టీకాంగ్రెస్ నేత అంజన్‌కుమార్ యాదవ్

ABN, First Publish Date - 2022-11-23T12:32:01+05:30

నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald case)లో ఈడీ (ED) ఎదుట టీకాంగ్రెస్ నేత అంజన్‌కుమార్ యాదవ్ (Anjan Kumar Yadav) హాజరయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald case)లో ఈడీ (ED) ఎదుట టీకాంగ్రెస్ నేత అంజన్‌కుమార్ యాదవ్ (Anjan Kumar Yadav) హాజరయ్యారు. ఈ కేసులో దేశవ్యాప్తంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యనేతలందిరినీ ఈడీ విచారిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగా

ణ కాంగ్రెస్ నేతలు ఐదుగురు.. అంజన్‌కుమార్ యాదవ్, షబ్బీర్ ఆలీ (Shabbir Ali), గీతారెడ్డి (Geetha Reddy), సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy), గాలి అనిల్ కుమార్‌‌ (Gali Anil Kumar)లకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకు నలుగురు నేతలను అధికారులు విచారించి, వారి స్టేట్‌మెంట్‌లు రికార్డు చేశారు. తాజాగా బుధవారం అంజన్‌కుమార్ యాదవ్ హాజరయ్యారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి విరాళాలపై అధికారులు ప్రశ్నించనున్నారు. ఈడీ విచారణలో నలుగురు నేతలు విరాళాలు ఇచ్చినట్లు ఒప్పుకున్నారు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి.. పార్టీ ఎవరికి ఇవ్వమని చెప్పింది? ఎందుకిచ్చారన్న కోణంలో వారిని అధికారులు విచారించారు. ఇవాళ అంజన్‌కుమార్ యాదవ్‌ను అధికారులు విచారిస్తున్నారు.

Updated Date - 2022-11-23T12:32:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising