ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాళ్లు మొక్కుతూ.. మెడకు ఉరితాళ్లతో...ఓయూ విద్యార్థుల నిరసన

ABN, First Publish Date - 2022-10-24T05:18:49+05:30

ఓటర్ల కాళ్లు మొక్కుతూ.. మెడకు ఉరితాళ్లు వేసుకొని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీఆర్‌ఎస్‌ను ఓడించాలని ఓటర్లకు విజ్ఞప్తి

నల్లగొండ జిల్లా చండూరులో ప్రచారం

చండూరు, అక్టోబరు 23: ఓటర్ల కాళ్లు మొక్కుతూ.. మెడకు ఉరితాళ్లు వేసుకొని.. కేసీఆర్‌ను గెలిపిస్తే మాకు ఉరే దిక్కు అంటూ ఓయూ జేఏసీ విద్యార్థులు నల్లగొండ జిల్లా చండూరులో వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. తొమ్మిది రోజులుగా నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్న ఓయూ జేఏసీ విద్యార్థులు... ఆదివారం చండూరులో తమ నిరసన ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ... రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడంలో సీఎం కేసీఆర్‌ విఫలమయ్యారన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిదేళ్లు కావొస్తున్నా నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్నందుకు నిరసనగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేపట్టామన్నారు.

నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి, దాటవేత ధోరణి అవలంభిస్తున్నారన్నారు. వందేళ్లు పూర్తి చేసుకున్న ఉస్మానియా యూనివర్సిటీలో అధ్యాపకుల కొరత ఉందన్నారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న రెండున్నర లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు, రైతులు సహా అన్ని వర్గాల ప్రజలు మోసపోయారన్నారు. పురుగుల అన్నం పెడుతున్న సంక్షేమ హాస్టళ్లలో చదువుకోవాల్సి వస్తోందన్నారు. కేసీఆర్‌ మనవడు కూడా ప్రభుత్వ సంక్షేమ హాస్టల్‌లో ఉండగలరా? అని ప్రశ్నించారు. ‘‘సాలు దొర, సెలవు దొర, మునుగోడు అంటే చిన్నచూపు ఉన్న కేసీఆర్‌ను ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం, టీఆర్‌ఎస్‌ మాటలు నమ్మవద్దు’’ అంటూ ప్లకార్డులతో, ప్రధాన వీధుల్లో గడపగడపకు తిరుగుతూ ప్రచారం చేశారు. కార్యక్రమంలో సురేష్‌ యాదవ్‌, మహేష్‌ యాదవ్‌, సంపత్‌, శివయాదవ్‌, ప్రశాంత్‌, సైదులు, సాయి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-24T05:18:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising