ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Draupadi Murmu: ఏ రంగంలోనైనా ఆత్మసంతృప్తి చాలా ముఖ్యం..

ABN, First Publish Date - 2022-12-27T14:47:03+05:30

హైదరాబాద్: శీతాకాలం విడితికి హైదరాబాద్‌ వచ్చిన భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Draupadi Murmu) మంగళవారం హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: శీతాకాలం విడితికి హైదరాబాద్‌ వచ్చిన భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Draupadi Murmu) మంగళవారం హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నారాయణగూడలోని కేశవ్‌ మెమోరియల్‌ కాలేజ్ (Keshav Memorial College) విద్యార్థులతో రాష్ట్రపతి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు, ఫ్యాకల్టీలతో ఇంటరాక్ట్ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు సమావేశమైన రాష్ట్రపతి విద్యార్థుల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.. మన విద్యా విధానంలో క్రమశిక్షణ ఉంటుందని, సెలెబస్‌లో చిన్నారులు చిన్ననాటి నుంచి తల్లిదండ్రుల గురించి మాత్రమే కాదు వ్యావహారికత కూడా నేర్చుకోవాలని సూచించారు. జీవించేందుకు తిండి బట్ట ఇల్లు కొంత చదువుతుంటే చాలని, ఒక్క ఇల్లు ఉంటే సరిపోతుంది .. కాని అంతటా సొంత ఇల్లు కావాలనుకుంటారని, జీవితంలో సంతృప్తి ఉండాలని, సంతృప్తి జీవితానికి కీగా ఉండాలన్నారు. ‘నా జీవితంపై నేను సంతృప్తిగా ఉన్నాను’ అని అన్నారు. ఏ రంగంలోనైనా ఆత్మసంతృప్తి చాలా ముఖ్యమని, పక్క వాళ్ళతో పోల్చుకుని జీవిస్తే ప్రెజర్ పెరుగుతుందన్నారు.

మహిళా, పురుషులు అన్న తేడా ఉండకూడదని, మహిళలకు పనుల్లో ఆంక్షలు ఉండకూడదని రాష్ట్రపతి అన్నారు. శక్తి లేకుండా శివుడు పూర్తిగా లేడని, ఇప్పటికీ ప్రతి గ్రామంలో గ్రామదేవతలు ఉంటారన్నారు. మహిళలు ఎక్కడ నుంచి ఎక్కడికో చేరుకున్నారని, మహిళలపై ఉన్న దృక్కోణంను ఇప్పటి నుంచే మార్చుకోవాలన్నారు. పిల్లలు ఎవరితో కలుస్తున్నారు... ఎలాంటి వారితో మాట్లాడుతున్నారో తల్లిదండ్రులు గమనించాలన్నారు. సమాజాన్ని బాగు పర్చేందుకు ప్రతి ఒక్కరిలో మార్పు రావాలన్నారు. కల్చర్, సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, బాలబాలికలు సరైన దారిలో వెళ్ళకపోతే అనేక ఇబ్బందులు వస్తాయని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు.

తెలంగాణ పోరాట యోధులను ఎప్పటికి గుర్తు పెట్టుకుంటారని, నూతన విద్యా విధానం క్రియేటీవిటీ మేల్కొలుపుతుందని ద్రౌపతి ముర్ము అన్నారు. ఈ విధానం దేశాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని, ఇది సెల్ఫ్ ఇంప్రూవ్ మెంట్ కోసం అనువైన విధానమన్నారు. అండర్ స్టాండింగ్ పెంచుకునేందుకు ఎక్కువగా చదవాలని, హైదరాబాద్ ఉద్యోగ అవకాశాలకు కేంద్రంగా ఉందని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-12-27T14:47:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising