ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్పీడ్‌ తగ్గేదేలే

ABN, First Publish Date - 2022-11-14T00:13:39+05:30

మహానగరంలో ఎన్ని ప్రయోగాలు చేసినా ట్రాఫిక్‌ కష్టాలు తీరకపోగా, రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పది నెలలు.. రూ.31.14 లక్షల ఉల్లం‘ఘనులు’

అత్యధికం వితవుట్‌ హెల్మెట్‌.. ఓవర్‌ స్పీడ్‌

హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌ 13 (ఆంధ్రజ్యోతి): మహానగరంలో ఎన్ని ప్రయోగాలు చేసినా ట్రాఫిక్‌ కష్టాలు తీరకపోగా, రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఉద్యోగం, ఉపాధి తర్వాత జనం ఎక్కువగా గడిపేది ట్రాఫిక్‌ మధ్యలోనే అంటే అతిశయోక్తి కాదు. అయితే, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు ట్రై కమిషనరేట్‌ ట్రాఫిక్‌ పోలీసులు అనేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఉల్లంఘనులపై ఉక్కుపాదం మోపి, బెటర్‌ ట్రాఫిక్‌ను అందించడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆపరేషన్‌ రోప్‌, ప్రత్యేక తనిఖీలు వంటివి చేస్తున్నా కొందరు వాహనదారులు ట్రాఫిక్‌ రూల్స్‌ను పాటించడంలేదు. దాంతో నిబంధనలు అతిక్రమించే వాహనదారులపై ట్రాఫిక్‌ వాయిలేషన్‌ కేసులు నమోదు చేస్తున్నారు. ఒక్క సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో కేవలం పదినెలల్లోనే 31,14,233 ట్రాఫిక్‌ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో మరో 5వేల కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ద్విచక్ర వాహనాలే అఽధికం

నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువగా ద్విచక్ర వాహన దారులే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇష్టానుసారంగా వాహనాలు నడపడం, మద్యం మత్తులో డ్రైవింగ్‌తో నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ట్రాఫిక్‌ నిబంధనలపై పోలీసులు ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సోషల్‌ మీడియాల్లోనూ ప్రమాదాల తీవ్రతను, వాహనదారులు నిర్లక్ష్యానికి బలవుతున్న జీవితాలను చూపిస్తూ వీడియోలు పోస్టు చేస్తున్నారు. అయినా కూడా వాహనదారుల్లో కొంచెం కూడా మార్పు రావడంలేదు. రాష్‌ డ్రైవింగ్‌, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, సిగ్నల్‌ జంపింగ్‌, ట్రిపుల్‌ రైడింగ్‌ ఇలా అనేక రకాలుగా ట్రాఫిక్‌ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాల్సిన పోలీసులు కొన్ని సందర్భాల్లో వాయిలేషన్‌ ఫొటోలు తీయడానికే పరిమితమవుతున్నారు.

వాహనానికి హెల్మెట్‌..

సైబరాబాద్‌లో ఈ పదినెలల్లో నమోదైన ఉల్లంఘన కేసుల్లో అత్యధికంగా 6.64లక్షల వితవుట్‌ హెల్మెట్‌ కేసులు, 6.52లక్షల పిలియన్‌ రైడర్‌ వితవుట్‌ హెల్మెట్‌ కేసులు రిపోర్టయ్యాయి. హెల్మెట్‌ ధరించడంపై ప్రజల్లో అవగాహన వచ్చినప్పటికీ ఇంకా చాలామంది హెల్మెట్‌ లేకుండానే వాహనాలు నడుపుతున్నారు. కొంతమంది హెల్మెట్‌ను తలకు పెట్టుకోకుండా వాహనానికి తగిలించి నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో వితవుట్‌ హెల్మెట్‌ కేసులు అధికంగా పెరిగినట్లు ట్రాఫిక్‌ పోలీసులు వెల్లడించారు. కాగా.. ఓవర్‌ స్పీడ్‌/రాష్‌ డ్రైవింగ్‌ కేసులు 2,39,638 నమోదైనట్లు పోలీసుల గణాంకాలు చెబుతున్నాయి.

27,031 ఫ్రీ లెఫ్ట్‌ బ్లాక్‌ కేసులు

543 ఎఫ్‌ఐఆర్‌లు

హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌ 13 (ఆంధ్రజ్యోతి): ఆపరేషన్‌ ‘రోప్‌’ (రిమూవల్‌ ఆఫ్‌ పార్కింగ్‌ అబ్‌స్ట్రక్షన్స్‌ అండ్‌ ఎన్‌క్రోచ్‌మెంట్స్‌)లో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. నగర కూడళ్లలో ఫ్రీ లెఫ్ట్‌ను బ్లాక్‌ చేసినందుకు 27వేల కేసులు నమోదు చేశారు. సిగ్నల్‌ పడినా, స్టాప్‌లైన్‌ దాటి వాహనం నిలిపిన వాహనదారులను గుర్తించి 2.80లక్షల కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్‌కు అడ్డంకులుగా మారిన 40 బస్టాపులను గుర్తించి వాటిలో 14 బస్టాపులను మార్చారు. మూడింటిని కాస్త సర్దుబాటు చేయగా, ఐదింటికి అవకాశం లేకపోవడంతో వదిలేశారు. మిగతా 18 బస్టాపుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. ట్రాఫిక్‌ అడ్డంకులుగా మారిన 30 ఆటో స్టాండ్‌లలో 19 స్టాండ్‌లను మార్చేశారు. ట్రాఫిక్‌ అవరోధాలుగా మారుతున్న 19 యూటర్న్‌లలో అడ్డంకులుగా ఉన్న వాటిని తొలగించేందుకు జీహెచ్‌ఎంసీలోని ఇంజనీరింగ్‌ విభాగపు అధికారులతో చర్చిస్తున్నారు. ఇప్పటికే హిమాయత్‌నగర్‌ రోడ్‌, బంజారాహిల్స్‌లోని జవహర్‌నగర్‌లో రెండు యూటర్న్‌లను పూర్తిగా మూసివేశారు.

క్రమశిక్షణ పెరుగుతోంది..

ఆపరేషన్‌ ‘రోప్‌’లో భాగంగా 4ఈ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఇంజనీరింగ్‌, ఎడ్యుకేషన్‌, ఎనేబుల్‌మెంట్‌) చర్యలతో వాహనదారుల్లో క్రమశిక్షణ పెరుగుతోందని నగర ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ రంగనాథ్‌ తెలిపారు. సెప్టెంబర్‌ 15న ప్రారంభించిన ఆపరేషన్‌ రోప్‌ విధానం అమలులోకి వచ్చి 50 రోజులు దాటిందని తెలిపారు.

ఆపరేషన్‌ రోప్‌లో భాగంగా పబ్లిక్‌ స్థలాల్లో పార్కింగ్‌, ఫుట్‌పాత్‌లను ఆక్రమించిన షాపులను గుర్తించి ఈ నెల 9 వరకు 11,236 నోటీసులు జారీ చేశామని, ఇందులో తీవ్రత ఉన్న వాటిని గుర్తించి 543 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు వివరించారు. వీధి రోడ్లపై.. బస్తీల్లో అక్రమంగా నెలల తరబడి పార్క్‌ చేసి ఉన్న 5,121 వాహనాలను తరలించారు. దీంతో వాహనదారులతోపాటు పాదచారులకు ఎంతో సౌలభ్యం చేకూరిందన్నారు. వాహనదారులు నిబంధనలు పాటిస్తే ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పుతాయని ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ రంగనాథ్‌ తెలిపారు.

Updated Date - 2022-11-14T00:13:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising