High courtను ఆశ్రయించిన సునీల్ కనుగోలు
ABN, First Publish Date - 2022-12-29T12:39:38+05:30
సైబర్ క్రైమ్ పోలీసులు(Cyber crime police) ఇచ్చిన నోటీసుపై తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు(sunil konugolu) హైకోర్టును ఆశ్రయించారు. సైబర్ క్రైమ్ పోలీసులు
హైదరాబాద్: సైబర్ క్రైమ్ పోలీసులు(Cyber crime police) ఇచ్చిన నోటీసుపై తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు(sunil konugolu) హైకోర్టును ఆశ్రయించారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఇచ్చిన 41ఏ CRPC నోటీసుపై న్యాయస్థాయంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈనెల 30న హాజరు కావాలని సునీల్ కనుగోలుకు పోలీసులు నోటీసు జారీ చేశారు. నోటీసును సవాల్ చేస్తూ సునీల్ కొనుగోలు హైకోర్టు(Telangana High Court)లో పిటిషన్ దాఖలు చేశారు. 41ఏ CRPC నోటీసుపై స్టే ఇవ్వాలని ధర్మాసనాన్ని సునీల్ కనుగోలు అభ్యర్థించారు. పిటిషన్‌పై రేపు కోర్టు విచారించనుంది.
ప్రతిపక్ష పార్టీలపై సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారన్న ఫిర్యాదుతో సునీల్ కనుగోలు కార్యాలయంపై సైబర్ క్రైమ్ పోలీసులు దాడి చేశారు. పలువురిని అదుపులోకి తీసుకుని కార్యాలయాన్ని సీజ్ చేశారు.
Updated Date - 2022-12-29T12:39:40+05:30 IST