ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad: రోహిత్ రెడ్డి ఈడీ విచారణలో ట్విస్టు

ABN, First Publish Date - 2022-12-19T11:32:07+05:30

హైదరాబాద్: ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి (Rohit Reddy) ఈడీ (ED) విచారణలో ట్విస్టు (Twist) నెలకొంది. ఈ రోజు విచారణకు దూరంగా ఉండాలని రోహిత్ రెడ్డి నిర్ణయించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి (Rohit Reddy) ఈడీ (ED) విచారణలో ట్విస్టు (Twist) నెలకొంది. ఈ రోజు విచారణకు దూరంగా ఉండాలని రోహిత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. వారం రోజులు గడువు కావాలంటూ న్యాయవాదితో ఈడీకి లేఖ (Letter) పంపారు. ఈ లేఖపై ఈడీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నిజానికి ఈడీ విచారణకు ఎమ్మెల్యే ఇంటి నుంచి బయలుదేరారు. రాహుకాలం ముగిసినందున ఈడీ కార్యాలయానికి బయలుదేరినట్లు చెప్పారు. ఆ తర్వాత ఫోన్ రావడంతో ప్రగతి భవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ (CM KCR)ను కలిశారు. ముఖ్యమంత్రితో భేటీ తర్వాత పరిణామాలు మారిపోయాయి. సీఎం సూచనలతో ఈవాల్టి ఈడీ విచారణకు దూరంగా ఉండాలని రోహిత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. మరికొంత సమయం కావాలని ఈడీని కోరాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి లాయర్‌తో ఈడీకి లేఖ రాశారు. తనకు చాలా తక్కువ సమయం కేటాయించారని, మరో వారం రోజులు గడువు కావాలంటూ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. వరుస సెలవుల కారణంగా బ్యాంక్‌ స్టేట్‌మెంట్స్‌... ఇతర డాక్యుమెంట్లు తీసుకోలేక పోయానని అన్నారు. అయితే ఈడీ ఎంత సమయం ఇస్తుందన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.

Updated Date - 2022-12-19T11:32:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising