ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Indian Racing League: కుంగిన వీఐపీ గ్యాలరీ.. అక్కడే ఉన్న మంత్రి కేటీఆర్, హిమాన్షు

ABN, First Publish Date - 2022-11-19T17:12:40+05:30

ఇండియన్ రేసింగ్ లీగ్‌ (Indian Racing League)లో అసశ్రుతి చోటుచేసుకుంది. కార్‌ రేసింగ్ లీగ్‌ను మంత్రి కేటీఆర్ (KTR) ప్రారంభించారు. ప్రారంభించిన అనంతరం రేస్‌లను కేటీఆర్, ఆయన కుమారుడు హిమాన్షు తిలకించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఇండియన్ రేసింగ్ లీగ్‌ (Indian Racing League)లో అసశ్రుతి చోటుచేసుకుంది. కార్‌ రేసింగ్ లీగ్‌ను మంత్రి కేటీఆర్ (KTR) ప్రారంభించారు. ప్రారంభించిన అనంతరం రేస్‌లను కేటీఆర్, ఆయన కుమారుడు హిమాన్షు తిలకించారు. అయితే అందరూ ఉత్సాహం చూస్తున్న సమయంలో ఐమాక్స్ పక్కన ఉన్న వీఐపీ గ్యాలరీ ఉన్నట్లుండి కుంగింది. స్టేజ్ కుంగిన సమయంలో కేటీఆర్, హిమాన్షు అక్కడే ఉన్నారు. ఎవరికీ ఎలాంటి హానీ జరుగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. నిర్వహణపై పలు ఆరోపణలు వస్తున్నాయి. వీక్షకులు ఏర్పాట్లపై మండిపడుతున్నారు. కార్‌ రేస్‌ చూసేందుకు వచ్చే అభిమానుల కోసం ప్రత్యేకంగా రెండు గ్యాలరీలు, ట్రాక్‌ మూలమలుపుల వద్ద టైర్లతో రక్షణ చర్యలు ఏర్పాటు చేశారు. ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌కు ఎన్‌టీఆర్‌ మార్గ్‌, హుస్సేన్‌సాగర్‌ పరిసరాల్లో నిర్వహిస్తున్నారు. రేస్‌లో పాల్గొనేందుకు పలు దేశాల నుంచి రేసర్లు వచ్చేశారు. శని, ఆదివారాల్లో ట్రయల్‌ నేపథ్యంలో ఎన్‌టీఆర్‌ మార్గ్‌లోని ట్రాక్‌ను పరిశీలించారు. రేసింగ్లో 12 కార్లు, ఆరు బృందాలు పాల్గొన్నాయి. ఆదివారం కూడా ఇండియన్ కార్‌ రేసింగ్‌ లీగ్‌ కొనసాగనుంది.

కార్లు చూసేందుకు పోటీ..

ఎన్టీఆర్‌ మార్గ్‌ (NTR Marg)కు చేరుకున్న రేస్‌ కార్లు చూసి, వాటితో ఫొటోలు దిగేందుకు యువత పోటీ పడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఎన్టీఆర్‌మార్గ్‌, హుస్సేన్‌ సాగర్‌ పరిసరాలు యువతతో సందడిగా కన్పించాయి. శనివారం మధ్యాహ్నం తొలి లీగ్‌లో భాగంగా ఎన్‌టీఆర్‌ గార్డెన్‌ (NTR Garden) చుట్టూ ఉన్న ట్రాక్‌ వెంట ఫార్ములా కార్లు పరుగులు తీశాయి. తొలిసారిగా నగరంలో జరుగుతుండడంతో రేస్‌ను చూసేందుకు ఎంతో మంది ఉత్సాహం చూపుతున్నారు. రూ.1250 నుంచి రూ. 6 వేల వరకు టికెట్ల ధరలు ఉన్నాయి. దీంతో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల అనుచరులు పాస్‌ల కోసం నానా తంటాలు పడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు చెప్పినా నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో రాత్రి వరకుపడిగాపులు కాసి వెళ్లిపోయారు.

అభిమానులకు ప్రత్యేక గ్యాలరీలు

కార్‌ రేస్‌ చూసేందుకు వచ్చే అభిమానుల కోసం ప్రత్యేకంగా రెండు గ్యాలరీలు, ట్రాక్‌ మూలమలుపుల వద్ద టైర్లతో రక్షణ చర్యలు ఏర్పాటు చేశారు. ట్రాక్‌ పనుల నేపథ్యంలో శుక్రవారం ఉదయం నుంచి ఖైరతాబాద్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వైపు వెళ్లే ఓ రోడ్డులో వాహనాలు అనుమతించలేదు. దీంతో సాయంత్రం ట్రాఫిక్‌ జాం సమస్యలు తలెత్తి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

Updated Date - 2022-11-19T17:12:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising