ఘనంగా మహాత్మా జ్యోతి రావు ఫూలే జయంతి వేడుకలు
ABN, First Publish Date - 2022-04-12T04:52:56+05:30
ఘనంగా మహాత్మా జ్యోతి రావు ఫూలే జయంతి వేడుకలు
వరంగల్ కలెక్టరేట్, ఏప్రిల్ 11: ఎందరో మహనీయుల పోరాట ఫలితంగానే అన్ని హక్కులు సాధించుకోగలిగామని, ఆ మహనీయుల్లో మహాత్మా జ్యోతి రావు ఫూలే ఆదర్శప్రాయుడని కలెక్టర్ బి.గోపి అన్నారు. సోమవారం ఫూలే జయంతిని పురస్కరించుకుని వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ హాల్‌లో బీసీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫూలే చిత్రపటానికి పూల మాలలు వేసి జ్యోతి ప్రజ్వలనచేసి నివాళులర్పించారు. అడిషనల్ కలెక్టర్ బి.హరిసింగ్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్‌రెడ్డి, జడ్పీ సీఈవో రాజారావు, డీఆర్‌డీఏ పీడీ సంపత్‌రావు, జాతీయ జ్యోతీరావు ఫూలే అవార్డు గ్రహీత చిప్ప వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అనంతరం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన విద్యార్థులకు బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. మహాత్మా జ్యోతీరావు పూలే జయంతిని పురస్కరించుకొని ములుగురోడ్ జంక్షన్‌లోరి మహాత్మా ఫూలే కాంస్య విగ్రహానికి కలెక్టర్ సోమవారం పూల మాలవేసి నివాళులర్పించారు.
దేశాయిపేటలో
వరంగల్ కలెక్టరేట్ : సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు సోమవారం జిల్లావ్యాప్తం గా ఘనంగా జరిగాయి. దేశాయిపేటలో ఫూలే విగ్రహానికి టీఎన్జీవోస్ నాయకులు నివాళులర్పించారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గజ్జెల రాంకిషన్, కార్యదర్శి గాజె వేణుగోపాల్ కార్పొ రేటర్ కావేటి కవిత, టీఎన్జీవోస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షు డు కోల రాజేష్‌కుమార్, పాలకుర్తి సదానందం, హే మానాయక్, వేముల వెంకటేశ్వర్లు, చందర్,దుర్గారావు, వెలిశాల రాజు, ఎంజీఎం రవికుమార్ పాల్గొన్నారు.
Updated Date - 2022-04-12T04:52:56+05:30 IST