ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రైవేటీకరణపై బీఆర్‌ఎస్‌ది రెండు నాలుకల ధోరణి

ABN, First Publish Date - 2022-12-27T00:46:30+05:30

సింగరేణి ప్రైవేటీకరణ అంశంలో బీఆర్‌ ఎస్‌ రెండు నాలుకల ధోరణి అవలంభిస్తూ కార్మిక వర్గాన్ని మోసం చేస్తున్నట్టు ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్‌ జనక్‌ప్రసాద్‌ అన్నారు. సోమవారం ప్రెస్‌భ వన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

సమావేశంలో మాట్లాడుతున్న జనక్‌ప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యైటింక్లయిన్‌కాలనీ, డిసెంబరు 26: సింగరేణి ప్రైవేటీకరణ అంశంలో బీఆర్‌ ఎస్‌ రెండు నాలుకల ధోరణి అవలంభిస్తూ కార్మిక వర్గాన్ని మోసం చేస్తున్నట్టు ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్‌ జనక్‌ప్రసాద్‌ అన్నారు. సోమవారం ప్రెస్‌భ వన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం ఎంఎంటీఆర్‌ యాక్టు తెచ్చి దేశంలోని బొగ్గు బ్లాక్‌లను కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడుతున్నదని, పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్‌ ఎంపీలు ఈయాక్టుకు మద్దతు తెలిపారని జనక్‌ప్రసాద్‌ పేర్కొన్నారు. కేవలం ప్రకటనల ద్వారా ప్రైవేటీకరణకు వ్యతిరేకమని బీఆర్‌ఎస్‌, టీబీజీకేఎస్‌లు ప్రచారం చేస్తున్నాయి తప్ప ఎక్కడా ఆచరణలో చూపడం లేద న్నారు. సింగరేణి పోరుదీక్ష పేరిట రామగుండం ఎమ్మెల్యే చేపట్టిన నిరసన వ్యక్తిగతంగా చేస్తున్నారా లేక పార్టీ సూచనల మేరకు చేస్తున్నారో చెప్పాలని జనక్‌ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. కోల్‌బెల్ట్‌ ప్రాంతాల్లోని బీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు నిరసన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.

ఒకవైపు టీబీజీకేఎస్‌ నాయకులు ప్రైవేట్‌ యంత్రాల ప్రారంభోత్సవాలు, కంటి న్యూస్‌ మైనర్ల ప్రారంభోత్సవాలకు హాజరవుతూనే ప్రెవేటీకరణకు వ్యతిరేకమని నిరసనలకు దిగడం హాస్యాస్పదమని అన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేటీకే ఓసీపీ, ఇందారం, కోయగూడెం, పూసలపల్లి ఓసీపీ విస్తరణలను ప్రైవేట్‌కు అప్పగిస్తే బీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు పట్టించుకోలేదని తెలిపారు. ఏదైనా రాష్ట్రంలోని బొగ్గు బ్లాక్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వం కోరితే వారికే కేటాయించాలని ఎంఎంటీఆర్‌ యాక్టులో 11వ నిబంధన ఉన్నట్టు జనక్‌ప్రసాద్‌ తెలిపారు. ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్న నాలుగు బ్లాక్‌లు సింగరేణికి కేటాయించాలని రాష్ట్రం కోరలేదని తెలిపారు. బీఆర్‌ఎస్‌ హయాంలో విచ్చలవిడిగా ప్రైవేటీకరణ జరుగుతున్నట్టు జనక్‌ప్రసాద్‌ అన్నారు. కేవలం కార్మికులను మభ్యపెట్టేందుకే పోరుదీక్ష పేరిట నిరసనలు జరుపుతున్నట్టు పేర్కొన్నారు. తాడిచర్ల బ్లాక్‌ను కాంగ్రెస్‌ హయాంలో సింగరేణికి అప్పగిస్తే బీఆర్‌ఎస్‌ ప్రైవేట్‌ సంస్థకు అప్పగించడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈవిలేకరుల సమావేశంలో నర్సింహారెడ్డి, రాజమౌళి, సమ్మయ్య, ధర్మపురి, అక్బర్‌అలీ, ప్రసాద్‌, మార్కండేయ, టైసన్‌ శ్రీనివాస్‌, ఎట్టెం కృష్ణ, చిన్నయ్యలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-27T00:46:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising