ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా స్వచ్ఛ సర్వేక్షణ్‌ సంబరాలు

ABN, First Publish Date - 2022-12-03T23:55:59+05:30

‘స్వచ్ఛ సర్వే క్షణ్‌ గ్రామీణ్‌’లో నవంబరు మాసానికి సంబంధించి రాజన్న సిరిసిల్ల జిల్లా ఫోర్గ్‌ స్టార్‌ కేటగిరీలో దేశంలోనే మొదటి స్థానంలో నిలవడంతో శనివారం కలెక్టరేట్‌లో కేక్‌ కట్‌ చేసి సంబరాలు నిర్వహించారు.

కలెక్టరేట్‌లో కేక్‌ కట్‌ చేస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ అరుణ, కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరిసిల్ల, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): : ‘స్వచ్ఛ సర్వే క్షణ్‌ గ్రామీణ్‌’లో నవంబరు మాసానికి సంబంధించి రాజన్న సిరిసిల్ల జిల్లా ఫోర్గ్‌ స్టార్‌ కేటగిరీలో దేశంలోనే మొదటి స్థానంలో నిలవడంతో శనివారం కలెక్టరేట్‌లో కేక్‌ కట్‌ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్‌ పర్సన్‌ అరుణ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ పల్లెప్రగతి, హరితహారం వంటి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని, తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి పచ్చదనంతో పరిశుభ్రంగా మారుస్తున్నారని అన్నారు. పంచాయతీ రాజ్‌ సిబ్బంది, అధికారులు నిర్విరామ కృషితోనే జిల్లాకు ఇంత గొప్ప అవకాశం దక్కిందన్నారు. ఇదే స్ఫూర్తితో ఫైవ్‌స్టార్‌ ర్యాంకింగ్‌లోనూ ముందు నిలవాలన్నారు. కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి మాట్లాడుతూ మంత్రి కేటీఆర్‌ మార్గదర్శనం, ప్రజాప్రతినిధులు, అధికారుల కృషితో నంబర్‌ వన్‌ స్థానం సాధించామన్నారు. మండల, గ్రామ ప్రజాప్రతినిధులు, డీఆర్డీవో, డీపీవో, ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్‌, టెక్నికల్‌ అసిస్టెంట్లు, పారిశుధ్య సిబ్బంది, కార్మికులందరికీ అభినందనలు తెలిపారు. అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌, జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, జిల్లా పంచాయతీ అఽధికారి రవీందర్‌, అదనపు డీఆర్డీవో మదన్‌మోహన్‌, సుధారాణి పాల్గొన్నారు.

సిరిసిల్ల టౌన్‌ : సిరిసిల్ల పట్టణం ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో జడ్పీ చైర్‌పర్సన్‌ అరుణ, టెక్స్‌టైల్‌ పవర్‌లూం డెవలప్‌మెంట్‌ చైర్మన్‌ గూడురి ప్రవీణ్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య కేక్‌ కట్‌ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్‌ పర్సన్‌ న్యాలకొండ అరుణరాఘవరెడ్డి విలేకరులతో మాట్లాడారు. జిల్లా ప్రజాప్రతినిధులు, ప్రజలు, అధికారుల సమిష్టి కృషితో నంబరువన్‌ స్థానం సాధ్యమైందన్నారు. రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, కోనరావుపేట ఎంపీపీ చంద్రయ్యగౌడ్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, ప్రధాన కార్యదర్శి మ్యాన రవి, ఉపాధ్యక్షుడు ఎండీ సత్తార్‌, కౌన్సిలర్‌ అన్నారం శ్రీనివాస్‌, సిరిసిల్ల అర్బన్‌ బ్యాంక్‌ మాజీ చైర్మన్‌ దార్నం లక్ష్మినారాయణ, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు న్యాలకొండ రాఘవరెడ్డి, బొల్లి రామ్మోహన్‌, దార్ల సందీప్‌, బండ నర్సయ్య, రామ్మోహన్‌రావు, కమలాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-03T23:56:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising