ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెస్‌ పోరుకు రెడీ

ABN, First Publish Date - 2022-11-02T00:26:58+05:30

సిరిసిల్ల సహకార విద్యుత్‌ సరఫరా సంఘం ఎన్నికల పోరు మొదలైంది. హైకోర్టుకు గతంలో ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారమే రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ సెస్‌కు మంగళవారం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియను డిసెంబరు 29లోగా పూర్తి చేయాలని పేర్కొంది.

సెస్‌ ప్రధాన కార్యాలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ నోటిఫికేషన్‌

- డిసెంబరు 5న ఎన్నికల షెడ్యూల్‌

- డిసెంబరు 24న పోలింగ్‌, 26న కౌంటింగ్‌

- రాజకీయ పార్టీల్లో మొదలైన చర్చ

- అధికార పార్టీకి సవాల్‌

- హైకోర్టుకు ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు

- ఓటరు జాబితా తయారీలో సెస్‌ సిబ్బంది

- 2.51 లక్షల మంది ఓటర్లు

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

సిరిసిల్ల సహకార విద్యుత్‌ సరఫరా సంఘం ఎన్నికల పోరు మొదలైంది. హైకోర్టుకు గతంలో ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారమే రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ సెస్‌కు మంగళవారం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియను డిసెంబరు 29లోగా పూర్తి చేయాలని పేర్కొంది. ఎన్నికల అథారిటీ జారీ చేసిన నోటిఫికేషన్‌ సిరిసిల్ల సెస్‌ ప్రధాన కార్యాలయం నోటీస్‌ బోర్డులో ప్రదర్శించారు. దీంతో సెస్‌ ఎన్నికలపై రాజకీయ పార్టీల్లో చర్చలు మొదలయ్యాయి. సెస్‌ పరిధిలో 11 డైరెక్టర్‌ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. సిరిసిల్ల టౌన్‌, సిరిసిల్ల రెవెన్యూ మండలం, ఇల్లంతకుంట, గంభీరావుపేట, ముస్తాబాద్‌, ఎల్లారెడ్డిపేట, చందుర్తి, కోనరావుపేట, వేములవాడ, వేములవాడ రెవెన్యూ మండలం, బోయినపల్లి మండలాల డైరెక్టర్‌ స్థానాలు ఉన్నాయి. ఓటరు జాబితా పూర్తయిన తరువాత ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలు వెల్లడించనున్నారు. గతంలో ప్రభుత్వం నియమించిన సెస్‌ నామినేట్‌ కమిటీపై బోయినపల్లికి చెందిన కనకయ్య హైకోర్టును ఆశ్రయించారు. అనేక చర్చల మధ్య ప్రభుత్వం నియమించిన పర్సన్‌ ఇన్‌చార్జి చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌తోపాటు 14 మంది డైరెక్టర్ల కమిటీని హైకోర్టు రద్దు చేసింది. హైకోర్టులో అనేక చర్చలు, వాయిదాల మధ్య చివరకు రాష్ట్ర ఎన్నికల అదనపు రిజిస్ట్రార్‌ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ అందించారు. దాని ప్రకారమే ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ షెడ్యూల్‌, నోటిఫికేషన్‌ను ప్రకటించింది. డిసెంబరు 5న ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. డిసెంబరు 13 నుంచి 15 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 16న నామినేషన్ల పరిశీలన, 17న అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు, 24న పోలింగ్‌ నిర్వహిస్తారు. 26న ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడి ఉంటుంది. 27న చైర్మన్‌ ఎన్నిక నిర్వహిస్తారు.

రాజకీయ పార్టీల సమాయత్తం

సహకార రంగంలో దేశంలోనే సెస్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. సెస్‌ పరిధిలో 12 మండలాలు, రెండు మున్సిపాలిటీల పరిధిలో 2.69 లక్షల మంది సభ్యులు ఉన్నారు. తాజాగా ఓటరు జాబితాను సెస్‌ సిబ్బంది ఇంటింటా సర్వే ద్వారా రూపొందిస్తున్నారు. ఫొటోలతో కూడిన ఓటరు జాబితాను రూపొందించడానికి ప్రత్యేక యాప్‌ను ఉపయోగిస్తున్నారు. 2016 ఓటరు జాబితా ప్రకారం 2.59 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ సారి జిల్లాల పునర్విభజనతో ఏర్పడిన కొత్త మండలాలు, వీర్నపల్లి, రుద్రంగి, తంగళ్లపల్లి, వేములవాడ రూరల్‌ డైరెక్టర్‌ స్థానాలు పెరుగుతాయని భావించారు. రాష్ట్ర ఎన్నికల అథారిటీ ఇచ్చిన నోటిఫికేషన్‌లో 11 స్థానాలు మాత్రమే చూపించారు. అందులో రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. కొత్త మండలాలను చేర్చని పక్షంలో అ మండలాల్లోని వినియోగదారులు కోర్టును అశ్రయించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. మరోవైపు ఎన్నికలు ఖరారు కావడంతో రాజకీయ పార్టీలు సమాయత్తం అయ్యాయి. డిసెంబరు జరిగే ఎన్నికలకు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ ప్రధానంగా దృష్టి సారించాయి. అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్‌, బీజేపీదృష్టి పెట్టడమే కాకుండా సెస్‌లో పట్టు నిలుపుకోవాలని ఆరాట పడుతున్నాయి. అధికారపార్టీ టీఆర్‌ఎస్‌కు తమ ప్రభుత్వం ద్వారా నామినేట్‌ కమిటీని నియమించినా చుక్కెదురు కావడంతో సెస్‌ను దక్కించుకోవడం సవాల్‌గానే మారింది. ప్రధానంగా ఏకగ్రీవాలపై దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ దూకుడు మీద ఉండడంతో ఎన్నికలు రసవత్తరంగా సాగుతాయని భావిస్తున్నారు. మునుగోడు ఎన్నికల ఫలితాలు కూడా సెస్‌పై ప్రభావం చూపనున్నాయి. సెస్‌కు వినియోగదారులను ఎన్నుకున్న కమిటీలు చివరి వరకు ఉండగా నామినేట్‌ కమిటీల డైరెక్టర్లకు మాత్రం నిరాశ మిగులుతూ వచ్చింది. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో 2011లో నాగుల సత్యనారాయణ పర్సన్‌ ఇన్‌చార్జిగా త్రీమేన్‌ కమిటీని నియమించింది. కోర్టు ఆదేశాల మేరకు కమిటీ రద్దయ్యింది. 2016లో ఎన్నికలు జరుగగా 2021 ఫిబ్రవరి 27న పాలకవర్గం గడువు ముగిసింది. ఉన్న పాలకవర్గాన్ని పొడిగిస్తూ 1404/2021 ఫిబ్రవరి 19న సెస్‌ చైర్మన్‌గా ఉన్న లక్ష్మారెడ్డిని పర్సన్‌ ఇన్‌చార్జిగా, వైస్‌ చైర్మన్‌గా పనిచేసిన లగిశెట్టి శ్రీనివాస్‌తోపాటు 10 మంది డైరెక్టర్లను కమిటీ సభ్యులుగా నియమించింది. ఫిబ్రవరి 28న బాధ్యతలు తీసుకునే సమయంలోనే ప్రభుత్వం జీవోను రద్దు చేసింది. మళ్లీ ప్రభుత్వం ఏప్రిల్‌లో సెస్‌ పర్సన్‌ ఇన్‌చార్జి చైర్మన్‌గా గూడూరి ప్రవీణ్‌ను, సభ్యులుగా నంది శంకర్‌, పూసవెల్లి సరస్వతి, గొడిసెల అయిలయ్యయాదవ్‌, గౌరినేని నారాయణరావు, కొమ్ము బాలయ్య, కుంభాల మల్లారెడ్డి, మాడుగుల మల్లేశం, డప్పుల అశోక్‌, ఆకుల గంగరాజం, దేవరకొండ తిరుపతి, పోలాస నరేందర్‌, రేగుపాటి చరణ్‌రావు, అకుల దేవరాజం, మేడుదుల మల్లేశంను నియమిస్తూ కమిటీని వేసింది. ఈ కమిటీ చెల్లదని కోర్టును ఆశ్రయించడంతో రద్దు కావడమే కాకుండా కలెక్టర్‌ను పర్సన్‌ ఇన్‌చార్జిగా నియమిస్తూ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. సెస్‌ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 1970 - 1973 వరకు చైర్మన్‌గా వి.వెంకట్‌రెడ్డి, 1981 -1984 వరకు చైర్మన్‌గా జె.నర్సింగారావు, వైస్‌ చైర్మన్‌గా కొండ శంకరయ్య, 1985- 1988 వరకు చైర్మన్‌గా జె.నర్సింగరావు, వైస్‌ చైర్మన్‌గా సీహెచ్‌ అనందరావు, 1988-1991 వరకు చైర్మన్‌గా సీహెచ్‌ విష్నుప్రసాద్‌రావు, వైస్‌ చైర్మన్‌గా పల్లం నర్సయ్య, 2007- 2010 వరకు చైర్మన్‌గా చిక్కాల రామారావు, వైస్‌ చైర్మన్‌గా గూడూరి ప్రవీణ్‌, 2010- 2012 వరకు చైర్మన్‌గా అల్లాడి రమేష్‌, వైస్‌ చైర్మన్‌గా కొండూరు గాంధీ, 2016- 2021 వరకు చైర్మన్‌గా దోర్నాల లక్ష్మారెడ్డి, వైస్‌ చైర్మన్‌గా లగిశెట్టి శ్రీనివాస్‌ ఎన్నికల ద్వారా గెలుపొంది పాలకవర్గాలుగా కొనసాగాయి. ఇటీవల రద్దు చేసిన సెస్‌ నామినేట్‌ చైర్మన్‌గా నియమించిన గూడూరి ప్రవీణ్‌ను తెలంగాణ పవర్‌లూం అండ్‌ టెక్స్‌టైల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-11-02T00:27:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising