కేజీబీవీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి
ABN, First Publish Date - 2022-11-16T00:34:06+05:30
కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలలో పని చేస్తున్న సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యద ర్శులు బోగ రమేష్, కొక్కుల రాంచంద్రంలు సంఘపక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేఽశారు.
జగిత్యాల అర్బన్, నవంబరు 15: కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలలో పని చేస్తున్న సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యద ర్శులు బోగ రమేష్, కొక్కుల రాంచంద్రంలు సంఘపక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేఽశారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ధరూర్ క్యాంప్‌లో గల కేజీబీవీ పాఠశాలను సందర్శించి, వారి సమస్యలు అడిగి తెలుసుకొని, మూడు దశల్లో ఆందోళన కార్య క్రమాలు చేపట్టనున్నట్లు సిబ్బందికి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ సమాన పనికి సమాన వేతన స్కేలు ఇవ్వాలని, హాస్టల్ నిర్వహణ సమస్య లు పరిష్కరించాలని, కేజీబీవీ ప్రత్యేకాధికారులకు మోడల్ స్కూల్ హాస్టల్ నిర్వ హణ బాధ్యతల నుంచి తొలగించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే సెల వులు సిబ్బందికి వర్తింపజేయాలని, అలాగే మెడికల్ రీయంబర్స్‌మెంట్ సౌకర్యం కల్పించాలనే డిమాండ్‌లతో కేజీబీవీ పాఠశాల ఎదుట నిరసన తెలిపామన్నారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ సీనియర్ నాయకులు సూద రాజేంధర్, రాష్ట్ర అడిట్ కమిటీ సభ్యులు గొడుగు రఘుపతి యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు ఎడ్ల గోవర్ధన్, కే జీబీవీ స్పెషల్ అధికారి మధులత, సిబ్బంది కమల, గౌతమి, తిరుమ లలత, శ్రీదేవి, ప్రవీణ, నీరజ, కృష్ణవేణి, లావణ్య తదితరులున్నారు.
రాయికల్: కేజీబీవీ పాఠశాల సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని టీ పీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బోగ రమేష్ డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని ఉ ప్పుమడుగు పాఠశాలను ఆయన సందర్శించారు. ఆయన మాట్లాడుతూ తెలంగా ణా ప్రొగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర పిలుపు మేరకు కీజీబీవీ పాఠశాలల్లో ఉన్న సమస్యలపై మూడు దశల ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా సిబ్బందితో చర్చిం చి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ స మాన పనికి సమాన వేతనం ఇప్పించాలని రెసిడెన్షియల్ ఉపాధ్యాయులతో స మానమైన వేతనాన్ని అందించాలని హాస్టల్ సమస్యలను పరిష్కరించాలని, ప్రభు త్వ ఉద్యోగులకు వర్తించే అన్ని రకాల సెలవులు వర్తింపజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాంచంద్రం, కేజీబీవీ ప్రత్యేకాధికారి శోభా రాణి, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2022-11-16T00:34:08+05:30 IST