ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భక్తి శ్రద్ధలతో కోటి దీపోత్సవం

ABN, First Publish Date - 2022-11-18T00:53:57+05:30

లోక కల్యాణంతో పాటు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం ఉత్సాహంగా సాగింది.

దీప కాంతులతో విరాజిల్లుతున్న జూనియర్‌ కళాశాల మైదానం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోరుట్ల, నవంబరు 17 : లోక కల్యాణంతో పాటు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం ఉత్సాహంగా సాగింది. ఎంతో భక్తి శ్రద్ధలతో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని కార్తీక దీపాలు వెలిగించారు. కళాశాల మైదానం దీపపు కాంతులతో వెలిగిపోయింది. పట్టణంలోని జూనియర్‌ కళాశాల మైదానం వేదపండితులు పాలెపు జయరాంశర్మ, రాంశర్మ, వినయ్‌శర్మ, సిరిసిల్ల కార్తికేయ శర్మ, వేలేటి పశుపతి శర్మ మత్రోచ్ఛారణల మద్య దీపోత్సవం కన్నుల పండువగా సాగింది. ఉదయం నుంచిసుప్రభాత సేవలతో మొద లుకొని ప్రత్యేక పూజలను జరిపారు. హంపి పీఠాధిపతి పర్యవేక్షణలో స్థాపిత దేవతా పూజ, చండీ పారాయణ, చండీ హోమం బలిహరణ కా ర్యక్రమాలను వేద పండితులు జరిపారు. సాయంత్రం వేళలో మహిళలు లలిత, విష్ణుశాస్త్రనామ పారయణం నిర్వహించారు. ప్రత్యేక వేదిక ద్వార శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణంను రంగరంగ వైభవంగా వేదపండితులు నిర్వహించారు. స్వామివారికి వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం నుంచిపట్టు వస్త్రాలను దేవాలయ అర్చకులు స్థానిక ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు సమక్షంలో అందించారు. కల్యాణం అనంతరం స్వామివారి పల్లకి సేవ నిర్వహించగా ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు, ఆర్డీ వో వినోద్‌ కుమార్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అన్నం లావణ్య - అనిల్‌, వైస్‌ చైర్మె న్‌ గడ్డమీది పవన్‌ పాల్గొన్నారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. కోటి దీపోత్సవ కార్యక్రమానికి ప్రత్యేక పూజలను నిర్వహించిన వేదపండితులు దీపోత్సవ మహాయజ్ఞంను నిర్వహించారు. ఈ సందర్బం గా మహిళలు దీపాలను వెలింగించి మొక్కులు చెల్లించుకున్నారు. దీపపు కాంతులతో కళాశాల మైదానం విరాజిల్లింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు సాంస్కృతిక కార్యాక్ర మాలను నిర్వహించగా భక్తులను అకట్టుకున్నాయి.

సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి

- ప్రవచన కర్త బాచంపల్లి సంతోష్‌ కుమార్‌

సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుకొని దేశ ప్రతిష్టతను ప్రపంచ దేశాలకు చాటుదామని ప్రవచన కర్త బాచంపల్లి సంతోష్‌ కుమార్‌ అన్నారు. దీపోత్సవం విచ్చేసిన భక్తులకు కార్తికమాసం గురించి నిజా మా బాద్‌ ప్రవచన కర్త వేలేటి పశుపతితో కలిసి ప్రవచనాలను చేశారు. కార్తిక మాసంలో వెలిగించే దీపం మనిషిలోని మనుగడను మార్చుతూ అభివృద్ధి దిశగా నడిపిస్తుందని అన్నారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం

- ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు

పట్టణంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయ మ ని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు అన్నారు. కళాశాల మైదానం నిర్వహి స్తున్న దీపోత్సవ కార్యక్రమాల ముగింపు వేడులను పురస్కరించుకొని మా ట్లాడారు. కార్తీక మాసం విశిష్టతను ప్రజలకు తెలిపే విఽధంగా దీపోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తూ భక్తి మార్గంలో నడిపే విధంగా చూడడం హర్షనీయమని అన్నారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా కార్యక్రమాలను నిర్వహించి భక్తి మార్గానికి శ్రీకారం చుట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ పాలక వర్గ సభ్యులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

పోలీసుల బారీ బందో బస్తు

పట్టణంలో నిర్వహిస్తున్న దీపోత్సవ కార్యక్రమానికి కోరుట్ల పోలీసులు బారీ బందోబస్తును నిర్వహించారు. కోరుట్ల సిఐ రాజశేఖర్‌ రాజు ఆధ్వ ర్యంలో కోరుట్ల, మేడిపల్లి, కథఽలాపూర్‌ ఎస్‌ఐలు సతీష్‌, శ్యామ్‌రాజు, సుధీ ర్‌ రావు, రాంచంద్రంలు తమ సిబ్బందితో ప్రత్యేక బందోబస్తును నిర్వ హించారు.

Updated Date - 2022-11-18T00:53:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising