ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KTR: సీఎం కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు..

ABN, First Publish Date - 2022-12-20T14:53:38+05:30

రాజన్న సిరిసిల్ల జిల్లా: మహారాష్ట్ర (Maharashtra)లో కొన్ని గ్రామాల ప్రజలు తెలంగాణ (Telangana)లో కలపాలని కోరుతున్నారని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజన్న సిరిసిల్ల జిల్లా: మహారాష్ట్ర (Maharashtra)లో కొన్ని గ్రామాల ప్రజలు తెలంగాణ (Telangana)లో కలపాలని కోరుతున్నారని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి వేములవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై పోటీ చేయాలనుకున్నవారు ఓ రెండు మంచి పనులు ఎక్కువ చేయాలని సూచించారు. పొద్దున లేస్తే.. కొందరు నాయకులు సీఎం కేసీఆర్‌ (CM KCR)ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు శాపనార్థాలు పెడితే.. ప్రజలే కాపాడాలన్నారు. ‘మీ ఆశీస్సులు ఉంటే..కేసీఆర్’ను ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు. గత ప్రభుత్వాలు తెలంగాణను పట్టించుకోలేదని మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

కాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీ ఏర్పాటు అయ్యింది. డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తామన్న హామీ మరిచిన కేటీఆర్ అంటూ మండల విద్యార్థులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ‘‘నీ పార్టీ టీఆర్ఎస్‌ నుంచి బీఆర్‌ఎస్ అయ్యింది. మేము ఇంటర్ నుంచి డిగ్రీ చదువద్దా’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి కేటీఆర్‌ను ఒడిస్తామని మండల విద్యార్థులు అన్నారు.

Updated Date - 2022-12-20T14:53:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising