సెస్‌లో అవినీతిపై బహిరంగ చర్చకు రావాలి
ABN, First Publish Date - 2022-12-21T00:28:14+05:30
సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థలో జరిగిన రూ.600 కోట్ల అవినీతిపై సిరిసిల్ల బీజేపీ నాయకులు చేపట్టే బహిరంగ చర్చకు మంత్రి కేటీఅర్ రావాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి డిమాండ్ చేశారు.
- బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి
సిరిసిల్ల రూరల్, డిసెంబరు 20: సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థలో జరిగిన రూ.600 కోట్ల అవినీతిపై సిరిసిల్ల బీజేపీ నాయకులు చేపట్టే బహిరంగ చర్చకు మంత్రి కేటీఅర్ రావాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి డిమాండ్ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని లహరి ఫంక్షన్ హాల్‌లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంత్రి కేటీఅర్ సెస్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఓడిపోతారనే భయంతో ప్రధాని నరేంద్రమోడీ, జాతీయ నాయకుడు లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌పై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారన్నారు. మంత్రి కేటీఅర్ అంటే తకు గౌరవం ఉండడంతోనే తాము వారిని ఎక్కడా తిట్టడం లేదన్నారు. ఆయన దిగజారి మాట్లాడం చూస్తుంటే సిగ్గుపడాల్సి వస్తోందన్నారు. లిక్కర్ స్కాంలో చెల్లి కవిత, డ్రగ్స్ స్కాంలో బంధువులు దొరికిపోతారనే భయంతోనే మంత్రి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు. సీఎం కేసీఅర్, మంత్రి కేటీఆర్‌ను ప్రజలు కొట్టే రోజులు వచ్చాయన్నారు. ఎంపీ బండి సంజయ్‌కుమార్ తంబాకు తింటారని మంత్రి చేసిన వ్యాఖ్యాలపై హైదరాబాద్‌లోని అసెంబ్లీ ఎదుట అమరవీరుల స్థూపం వద్దకు బహిరంగ చర్చకు వచ్చి నిరూపించాలని డిమాండ్ చేశారు. తండ్రి పేరుతో రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్ ప్రజల విలువలను తెలుసుకోకుండా ఇష్టారాజ్యాంగా వ్యాఖ్యాలు చేయడం సరికాదన్నారు. సెస్‌లో జరిగిన రూ.600 కోట్ల కుంభకోణం వెనుక ఉన్న అధికార పార్టీ నాయకులను ముందు ప్రకటించిన తరువాతనే బహిరంగ చర్చకు వచ్చి జరిగిన అవినీతి ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెక్స్‌టైల్ పార్క్‌లో ఉన్న పరిశ్రమల్లో మరమగ్గాలను యజమానులు తక్కుకింద అమ్ముకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి వీరేందర్‌గౌడ్, జిల్లా ఇన్‌చార్జి గంగాడి మోహన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపీ, కరీంనగర్ పార్లమెంటరీ కన్వీనర్ ప్రవీణ్‌రావు, కో- కన్వీనర్ ఆడెపు రవీందర్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి గౌడ వాసు, కౌన్సిలర్ భాస్కర్, చేనేత సెల్ జిల్లా కన్వీనర్ నాగుల శ్రీనివాస్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గుండేల్లి వేణుగోపాల్, మోర శైలజ, మోర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-21T00:28:23+05:30 IST