ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధరణి పోర్టల్‌ను ఎత్తివేయాలి

ABN, First Publish Date - 2022-12-01T00:26:07+05:30

రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ధరణిని పో ర్టల్‌ను రద్దు చేసి పాత పద్ధతిని అమలులోకి తేవాలని ఏఐసీసీ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంథని, నవంబర్‌ 30: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ధరణిని పో ర్టల్‌ను రద్దు చేసి పాత పద్ధతిని అమలులోకి తేవాలని ఏఐసీసీ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. టీపీసీసీ పిలుపు మేరకు ప్రభుత్వ రైతు వ్యతిరేక విధనాలకు వ్యతిరేకంగా స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదట పార్టీ శ్రేణులతో కలిసి శ్రీధర్‌బాబు బుధవారం నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధరణిలో నిషేధిత జాబితాలో పొరపాటుగా నమోదైన భూముల సమస్యలను వెంటనే పరిష్కరించి బాధిత రైతులకు న్యాయం చేయాలన్నారు. అటవీ హక్కుల చట్టాన్ని అమలుచేసి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలన్నారు. కుర్చి వేసుకొని పోడు భూముల సమస్య పరిష్కా రిస్తానన్న సీఎం కేసీఆర్‌ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ అమ లుకావడం లేదన్నారు. పోడులో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఫారెస్టు అధికారి హత్యకు గురికావాల్సి వచ్చిందని, ఈ హత్యకు ప్రభత్వమే బాధ్య త వహించాలన్నారు. అసైన్డ్‌భూములకు సైతం అర్హులకు పట్టాలు ఇవ్వా లన్నారు. కౌలు రైతు చట్టాన్ని అమలుచేసి కౌలు రైతులకు ప్రభుత్వ పథ కాలు అమలుచేయాలన్నారు. టైటిల్‌ గ్యారెంటీ చట్టాన్ని అమలు చేయాల న్నారు. రైతులకు వెంటనే రూ.లక్ష రుణ మాఫీ అమలు చేయాలన్నారు. ధరణి వెబ్‌సైట్‌ నిర్వాహణ ఒక విదేశీ కంపెనీకి అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉండగా పోడు భూములకు పట్టాలు, నష్టపోయిన పంటలకు నష్టపరిహారం ఇచ్చిన ఘన త తమదేనన్నారు. రైతుల సంక్షేమమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమన్నారు. ఈ మేరకు ఆర్డీవో వీరబ్రహ్మచారికి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అబ్జర్వర్‌ సుధాకర్‌గౌడ్‌, నేతలు శశిభూషన్‌కాచే, సెగ్గెం రాజేష్‌, తిరుపతియాదవ్‌, గోటికార్‌ కిషన్‌జీ, చొప్పరి సదానందం, లింగయ్యయాదవ్‌, నియోజకవర్గంలోని జడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల పార్టీల అధ్యక్షులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-01T00:26:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising