రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ABN, First Publish Date - 2022-11-24T23:56:34+05:30
రైతుల సంక్షేమమే ప్రభు త్వ ధ్యేయమని, మార్కెట్ యార్డుకు వచ్చే రైతులకు అన్ని రకాల సే వలను అందిస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అ న్నారు.
పెద్దపల్లి, నవంబర్ 24 (ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే ప్రభు త్వ ధ్యేయమని, మార్కెట్ యార్డుకు వచ్చే రైతులకు అన్ని రకాల సే వలను అందిస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అ న్నారు. గురువారం ఆయన పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌లో రూ. 2.75 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రైతులకు సాగునీటితో పాటు రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను అమలుచేస్తున్నారన్నారు. వ్యవసాయా నికి 24గంటలపాటు విద్యుత్ సౌకర్యం కల్పించడంతో రైతులు ప్రతి ఏటా రెండు పంటలు పండిస్తున్నారని అన్నారు. పండించిన పంట ఉత్పత్తులను విక్రయించుకునేందుకు వ్యవసాయ మార్కెట్ యార్డు ల్లో అన్ని వసతులను కల్పిస్తున్నామన్నారు. ఆడ్తిదారులకు కొన్ని రూములను నిర్మించడంతో పాటు కొన్ని ప్లాట్‌ఫాంలను నిర్మించను న్నామని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని సౌక ర్యాలు కల్పిస్తున్నదని అన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారని అన్నారు. అనం తరం మహిళా కూలీలకు బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో మార్కెట్ కమిటీ చైర్మన్ శంకర్‌నాయక్, వైస్‌చైర్మన్ జడల సురేం దర్, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, ఎంపీపీ బండారి స్రవంతిశ్రీని వాస్, డీఎంవో ప్రవీణ్‌రెడ్డి, మార్కెట్ కార్యదర్శి దేవరాజు ప్రథ్వీరాజ్, డైరెక్టర్లు బి నరేష్, కె సంతోష్, ఎస్ రాములు, దుర్గయ్య, ఎం కృష్ణ మూర్తి, పి సరస్వతి, సరోత్తంరెడ్డి, ఎండి ఇక్బాల్, మున్సిపల్ వైస్ చైర్మన్ నాజ్మీన్ సుల్తానాబాద్, కౌన్సిలర్ రమాదేవి, వైస్‌ఎంపీపీ రాజ య్య, పీఏసీసీ చైర్మన్లు దాసరి చంద్రారెడ్డి, ఆళ్ల శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ ఎస్ పట్టణ, మండల అధ్యక్షులు ఉప్పు రాజ్‌కుమార్, మర్కు లక్ష్మణ్, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-11-24T23:56:38+05:30 IST