ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నియోజకవర్గంలో రోడ్లన్నీ బాగు చేస్తాం -

ABN, First Publish Date - 2022-12-12T00:52:46+05:30

కరీంనగర్‌ నియోజకవర్గంలోని రోడ్లన్నీ బాగు చేసి మట్టిరోడ్డు లేకుండా తీర్చిదిద్దుతామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి గంగుల కమలాకర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ.75 కోట్లతో పీఆర్‌, ఆర్‌అండ్‌బీ రోడ్ల అభివృద్ధి - 85శాతం పనులు పూర్తి

కరీంనగర్‌, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరీంనగర్‌ నియోజకవర్గంలోని రోడ్లన్నీ బాగు చేసి మట్టిరోడ్డు లేకుండా తీర్చిదిద్దుతామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ఆదివారం స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయం మీసేవలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్‌ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 85 శాతం మేర పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ రోడ్లు అద్భుతంగా నిర్మించామని తెలిపారు. మిగిలిపోయిన రోడ్లకు సంబంధించిన ప్రతిపాదనలు పంపగా 406, 407 జీవో కింద పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ శాఖల నుంచి మొత్తం 75 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని అన్నారు. అందులో 59 కోట్ల 30 లక్షలతో కొత్తపల్లి, రూరల్‌ మండలాలకు సంబంధించి ఆరు కొత్త రోడ్లు, వరదల వల్ల దెబ్బతిన్న 10 రోడ్లు బాగు చేస్తామన్నారు. 14 కోట్ల 78 లక్షలతో 8 ఆర్‌అండ్‌బీ రోడ్లను రెన్యువల్‌ చేస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు వాటి పనులను డిసెంబర్‌లో ప్రారంభించి మార్చి 31లోపు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. కరీంనగర్‌ పట్టణంలో డ్యామేజ్‌ అయిన రోడ్లకు సంబంధించి 40 కోట్ల మేర ప్రతిపాదనలు పంపామని, రేపు దానికి సంబంధించిన జీవో విడుదలవుతుందని మంత్రి తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, కొత్తపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ రుద్ర రాజు, ఎంపీపీ పిల్లి శ్రీలత, తిప్పర్తి లక్ష్మయ్య, విండో చైర్మన్‌ పెండ్యాల శ్యామ్‌సుందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ రెడ్డవేణి మధు, మాజీ ఎంపీపీ వాసాల రమేశ్‌, కో ఆప్షన్‌ సభ్యుడు సాబీర్‌ పాషా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-12T00:52:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising