పీఎం కిసాన్ కోసం ఈకేవైఎస్ తప్పని సరి
ABN, First Publish Date - 2022-11-30T00:09:24+05:30
పీఎం కిషాన్‌నిధి పథకంలో లబ్దిపొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి అభిమన్యుడు తెలిపారు.
జిల్లాలో 17,073 మంది ఆధార్ లింక్ చేయాలి
డీఏవో అభిమన్యుడు
కొత్తగూడెం కలెక్టరేట్, నవంబరు 29: పీఎం కిషాన్‌నిధి పథకంలో లబ్దిపొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి అభిమన్యుడు తెలిపారు. మంగళవారం డీఏవో కార్యాలయంలో వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇంకా 17,073 మంది రైతులు తమ ఆధార్‌నంబర్‌ను బ్యాంకు అకౌంట్‌కు లింక్‌అప్ చేయాల్సి ఉందన్నారు. వారందరిని లింకప్ చేయించి బయోమెట్రిక్ పద్దతిలో ఇకేవైసీ పూర్తి చేస్తే పీఎం కిసాన్ లబ్దిపొందే అవకాశం ఉంటుందన్నారు. సమావేశంలో కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం డివిజన్ల సహయ వ్యవసాయ సంచాలకులు కరుణశ్రీ, అబ్టల్‌బేగం,సుధాకర్‌రావు , ఇల్లెందు, మణుగూరు డివిజన్ల వ్యవసాయ అధికారులు అన్నపూర్ణ, మణిశంకర్, టెక్కికల్ అధికారులు రవికుమార్, లాల్‌చంద్, అరుణ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-11-30T00:09:28+05:30 IST