పాలేరు జలాశయాన్ని సందర్శించిన ఇరిగేషన్ ఎస్‌ఈ
ABN, First Publish Date - 2022-07-13T05:15:03+05:30
పాలేరు జలాశయాన్ని ఇరిగేషన్ శాఖ ఎస్‌ఈ నర్సింగరావు సందర్శించారు. జలాశయంలో గరిష్ట నీటిమట్టానికి నీరు చేరువలో ఉండటంతో పరిశీలించారు. ఇన్‌ఫ్లోస్, అవుట్‌ఫ్లో వివరాలు తెలుసుకున్నారు.
కూసుమంచి, జూలై12: పాలేరు జలాశయాన్ని ఇరిగేషన్ శాఖ ఎస్‌ఈ నర్సింగరావు సందర్శించారు. జలాశయంలో గరిష్ట నీటిమట్టానికి నీరు చేరువలో ఉండటంతో పరిశీలించారు. ఇన్‌ఫ్లోస్, అవుట్‌ఫ్లో వివరాలు తెలుసుకున్నారు. వర్షాలు మరో రెండురోజులు ఉండేఅవకాశం ఉందని, వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో పాలేరు జలాశయం నీటిమట్టం మరింతపెరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులను సూచించారు.ఎస్‌ఈ వెంట ఈఈ సమ్మిరెడ్డి, డిఈ బానాల రమేష్‌రెడ్డి, మధు, ఏఈలు ఉన్నారు. పాలేరు జలాశయాన్ని కూసుమంచి సీఐ సతీష్, ఎస్‌ఐ నందీప్ సందర్శించారు. ఫాలింగ్‌గేట్ల వద్దకు పర్యాటకులు ఎవరూ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, సిబ్బందిని ఏర్పాటుచేయాలని ఆదేశించారు. కాగా పాలేరు జలాశయం జలకళను సంతరించుకుంది. జలాశయంలో నీటిమట్టం 23 అడుగులకు చేరువలో ఉండటంతో అలుగులు పారుతోంది. ప్రస్తుతం జలాశయం 21.5 అడుగులకు నీరు చేరింది. ఇన్‌ఫ్లోగా 4వేల క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. ఫాలింగ్ గేట్లద్వారా సుమారు వెయ్యిక్యూసెక్కులు నీరు పాలేరు ఏట్లో కలుస్తోంది. జలాశయం నిండుకుండాలా మారడంతో పర్యాటకులకు కనువిందుచేస్తోంది.
Updated Date - 2022-07-13T05:15:03+05:30 IST