ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Draupadi Murmu: భద్రాచలంకు బయలుదేరిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ABN, First Publish Date - 2022-12-28T10:50:47+05:30

హైదరాబాద్: శీతాకాలం విడిదికి హైదరాబాద్‌ వచ్చిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) బుధవారం ఉదయం భద్రాచలంకు బయలుదేరి వెళ్లారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: శీతాకాలం విడిదికి హైదరాబాద్‌ వచ్చిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) బుధవారం ఉదయం భద్రాచలంకు బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. అక్కడ రాష్ట్రపతికి ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, ఎయిర్ పోర్టు అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రాజమండ్రి ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక హెలీకాప్టర్‌లో భద్రాచలం బయలుదేరివెళ్ళారు. భద్రాచలం (Bhadrachalam) రామయ్యను రాష్ట్రపతి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రాష్ట్రపతి భద్రాచలం పర్యటనతో జిల్లా అధికారిక యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు. వాయుసేన అధికారులు ఇప్పటికే హెలికాప్టర్‌ ట్రయల్‌ ల్యాండింగ్‌ చేశారు.

అరుదైన రికార్డు

కాగా రాష్ట్రపతి ద్రౌపదిముర్ము భద్రాచలం పర్యటనలో భాగంగా మధ్యాహ్నం ఐటీసీ గెస్ట్‌హౌజ్‌లో బస చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఐటీసీ కర్మాగారంలో బస చేయడం అరుదైన ఘనతగా పలువురు పేర్కొంటున్నారు. భద్రాచలానికి గతంలో రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణ, శంక్‌దయాల్‌ శర్మ వచ్చారు. గతంలో ఏ రాష్ట్రపతి ఐటీసీ కర్మాగారంలో బస చేయలేదని ఆదికారులు పేర్కొంటున్నారు.

నిఘానేత్రంలో సారపాక

రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో బుధవారం ఆదికారులు 144సెక్షన్‌ విధించారు. మండల పరిదిలోని ప్రధాన కూడళ్ల (మోరంపల్లిబంజర, బూర్గంపాడు, లక్ష్మీపురం, మణుగూరు క్రాస్‌ రోడ్డు) వద్ద బందోబస్తును ఏర్పాటు చేశారు. బుధవారం బూర్గంపాడు మండలం మీదుగా భద్రాచలం వైపునకు వెళ్లేందుకు అనుమతి లేదని, ఇప్పటికే ప్రజలకు, వాహనదారులకు అధికారులు అవగాహన కల్పించారు. రాష్ట్రపతి పర్యటనతో బూర్గంపాడు మండల పరిధిలో సుమారు 2వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా సారపాకలో రాష్ట్రపతి ల్యాండింగ్‌తో పాటు మధ్యాహ్న బస ఉండడంతో సారపాకను పోలీసులు వారి గుప్పిట్లోకి తీసుకున్నారు.

Updated Date - 2022-12-28T10:51:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising