ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం

ABN, First Publish Date - 2022-12-22T23:14:39+05:30

సింగరేణి కాలరీస్‌ కంపెనీ ఆవిర్భావ దినోత్సవం సింగరేణి డే వేడుకలకు మణుగూరు ఏరియాలోని భద్రాద్రి స్టేడియం ముస్తాబు అయింది.

ఏర్పాట్లను పరిశీలిస్తున్న జీఎం వెంకటేశ్వరరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మణుగూరు, డిసెంబర్‌ 22: సింగరేణి కాలరీస్‌ కంపెనీ ఆవిర్భావ దినోత్సవం సింగరేణి డే వేడుకలకు మణుగూరు ఏరియాలోని భద్రాద్రి స్టేడియం ముస్తాబు అయింది. ఏరియా జీఎం జీ వెంకటేశ్వరరెడ్డి ఆదే శాల మేరకు ఏరియాలోని పలు గనుల శాఖల అధికారులు సిబ్బంది కార్మికులు స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సింగరేణి కుటుంబాలను ఈ వేడుకల్లో బాగస్వామ్యులను చేస్తూ గత మూడు రో జులుగా వేడుకల్లో పలు రకాల క్రీడా పోటీలను నిర్వహిస్తూ వస్తు న్నారు. గురువారం మహిళలకు యువతులకు ముగ్గుల పోటీల నిర్వ హాణ జరిగింది. సేవా అధ్యక్షురాలు, లేడిస్‌ క్లబ్‌ అధ్యక్ష కార్యదర్శులు ఈ పోటీలను పరిశీలించి విజేతలను ఎంపిక చేశారు. ఏరియా జీఎం స్టేడి యంలో చేపట్టిన ఏర్పాట్లను గురువారం రాత్రి పరిశీలించారు. అధికా రులకు పలు సూచనలు చేశారు. స్టేడియం అంతా ప్రకాశ వంతంగా ఉండేందుకు ప్రత్యేక హైమస్‌ లైటింగ్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. అలాగే పలు గనుల డిపార్టుమెంట్లకు పలు శాఖలకు సంబంధించిన నమూనాల స్టాల్స్‌ ఏర్పాట్లను పూర్తి చేసే పనుల్లో అఽధికారులు నిమగ్నమయ్యారు. ఈ కార్యక్రమంలో ఏరియా జీఎం లలిత్‌ కుమార్‌, డీజీఎం పర్సనల్‌ రమేష్‌, ఏజీఎం (సివిల్‌) వెంకటేశ్వర్లు, ఏరియా వర్క్‌ షాపు అధికారులు, సిబ్బంది, సెక్యూరిటీ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-22T23:14:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising