Praveen Kumar: నేతల తీరు అప్రజాస్వామికం - మద్యం, నగదు పంపిణీ భారీగా జరిగింది
ABN, First Publish Date - 2022-11-04T17:53:44+05:30
చౌటుప్పల్, యాదాద్రి భువనగిరి జిల్లా: మునుగోడు ఉప ఎన్నికలో వివిధ పార్టీల నాయకులు అప్రజాస్వామికంగా వ్యవహరించారని బహుజన సమాజ్ పార్టీ (BSP) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. మద్యం, డబ్బు పంపిణీ భారీ స్థాయిలో జరిగిందని ఆరోపించారు. బ్యాలెట్ పేపర్‌లో తమ పార్టీ గుర్తును పలుచగా ముద్రించి, మిగతా పార్టీల గుర్తులను స్పష్టంగా కనిపించేలా ముద్రించడంపై మీడియా సమావేశంలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో సుమారు రూ. 170 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. వందల కోట్ల రూపాయలు ఓటర్లకు పంచారు. ప్రతి కుటుంబానికి సుమారు రూ. 40 వేల వరకు నగదు పంచి పెట్టారు. అప్రజాస్వామ్యం పద్ధతిలో నాయకులు గెలవాలని ఇలా చేశారు. మద్యం, డబ్బుల పంపిణీ గురించి పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా ఆపలేకపోయారు. గ్రామాల్లో చాలా మంది తమకు డబ్బులు ముట్టలేదని 3 గంటల వరకు పోలింగ్ కేంద్రానికి రాలేదు. ఎలక్షన్ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు డబ్బుల పంపిణీ జరిగింది. మరి ఎలక్షన్ కమిషనర్, అధికారులు ఏం చేస్తున్నారో సమాధానం చెప్పాలి.
1, 2, 3 తేదీల్లో ఇతర పార్టీ నాయకులు డబ్బులు పంచుతున్నారని చెప్పినా ఎన్నికల అధికారులు చీమ కుట్టినట్లుగా వ్యవహరించారు. మొదటి స్థానంలో ఉన్న బహుజన సమాజ్ పార్టీ గుర్తును పలుచగా ముద్రించి, మిగతా అభ్యర్థుల గుర్తులను మాత్రం స్పష్టంగా కనిపించేలా ముద్రించారు. ప్రజలు ఈ విషయాలను గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో బహుజన సమాజం ఏర్పడనుంది’’ అని ప్రవీణ్ పేర్కొన్నారు.
Updated Date - 2022-11-04T17:53:46+05:30 IST