ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రంగ సముద్రానికి మరో బోటు

ABN, First Publish Date - 2022-09-04T04:38:01+05:30

రంగసముద్రం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ రానున్న రోజుల్లో టూరిజం కేంద్రంగా ఏర్పాటు చేయడానికి మంత్రి నిరంజన్‌రెడ్డి తన వంతు కృషి చేస్తున్నారు.

రంగ సముద్రానికి చేరిన టూరిజం బోటు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీరంగాపురం,సెప్టెంబరు 3: రంగసముద్రం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ రానున్న రోజుల్లో టూరిజం కేంద్రంగా ఏర్పాటు చేయడానికి మంత్రి నిరంజన్‌రెడ్డి తన వంతు కృషి చేస్తున్నారు. తెలంగాణ టూరిజం శాఖ నుంచి ఐదు నెలల కిందట ఆరుగురి సామార్థ్యం గల ఒక బోటు ను తీసుకువచ్చారు. రూ. 17 లక్షల విలువగల  మరో బోటును శనివారం తీసుకువచ్చారు. ఈ బోటుపై 20 మంది ప్రయాణించే సామార్థ్యం కలిగి ఉంటుందని అధికారులు తెలిపారు. దసరా పండుగకు టూరిజం శాఖ ఆధ్వర్యంలో బోటింగ్‌ను మంత్రి ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీరంగాపురం ఆలయ ప్రాంతంలో బోటింగ్‌ అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డికి గ్రామస్థులు, యువకులు, టూరిస్టులు కృతజ్ఞతలు తెలిపారు.  కార్యక్రమంలో ఎంపీపీ గాయత్రి, సర్పంచ్‌ వినీల రాణి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వెంకట స్వామి,  సీనియర్‌ నాయకులు పృథ్వీరాజ్‌,  రాధాకృష్ణ, సంపత్‌ నాయుడు, కృష్ణయ్య, సీతమ్మ, రాజు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-04T04:38:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising